PM Kisan Samman Nidhi 14th Installment: పీఎం కిసాన్ యోజన పథకం 13వ విడత ఇన్‌స్టాల్‌మెంట్ ఇటీవలే కోట్లాది మంది రైతుల ఖాతాల్లోకి క్రెడిట్ అయిన విషయం తెలిసిందే. మీరు కూడా పీఎం కిసాన్ యోజన పథకం లబ్ధిదారులయినట్లయితే, మీకు వెంటనే మరో గుడ్ న్యూస్. 13వ విడత ముగిసీ ముగియగానే పిఎం కిసాన్ 14వ విడత డబ్బులు కూడా కోట్లాది మంది రైతుల ఖాతాల్లోకి జమ కాబోతున్నాయని తెలుస్తోంది. రైతుల ఖాతాల్లో 14వ విడత డబ్బులను జమ చేసే విషయంలో కేంద్రం ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలుపెట్టింది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు ఆర్థిక ప్రయోజనం చేకూర్చే పీఎంకిసాన్ 14వ విడతకు సంబంధించిన సమాచారం గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

16,000 కోట్లు విడుదల 
ఫిబ్రవరి 27న ప్రభుత్వం పిఎం కిసాన్ నిధి 13వ విడత డబ్బులను విడుదల చేసిన కేంద్రం.. అర్హులైన 8 కోట్లకుపైగా రైతులు అందరి ఖాతాల్లో కలిపి మొత్తం రూ. 16,000 కోట్లు బదిలీ చేసింది. 


14వ ఇన్‌స్టాల్‌మెంట్ పొందాలంటే..
పిఎం కిసాన్ 13వ విడత విడుదలైన కొద్ది రోజులకే పీఎం కిసాన్ పథకం 14వ విడత ఇన్‌స్టాల్‌మెంట్ విడుదల కోసం కేంద్రం పని ప్రారంభించింది. అయితే, ఒకవేళ మీరు ఇంకా KYC ప్రక్రియను పూర్తి చేయనట్టయితే.. వెంటనే ఆ ప్రక్రియను పూర్తి చేయండి. ఎందుకంటే.. కేవైసీ పూర్తి చేయని రైతుల ఖాతాల్లో నగదు బదిలీ జరగదు అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కేవైసీ ప్రక్రియ సకాలంలో పూర్తి చేయకపోతే.. 13వ విడత ఇన్‌స్టాల్‌మెంట్ తరహాలోనే 14వ విడత ఇన్‌స్టాల్‌మెంట్ కూడా నిలిచిపోయే ప్రమాదం ఉందనే విషయం మర్చిపోవద్దు.


ఇ-కేవైసి ఎలా చేయాలంటే..
పిఎం కిసాన్ యోజన పథకానికి సంబంధించి అధికారిక వెబ్‌సైట్‌ pmkisan.gov.in లోకి లాగాన్ అవండి.
వెబ్‌సైట్‌లో కుడి వైపున ఉన్న e-KYC ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
మీ ఆధార్ నంబర్‌ను ఎంట్రీ చేయండి.
ఈ OTP మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన తర్వాత, దాన్ని ఎంటర్ చేయండి.
ఆ తరువాత సబ్మిట్ క్లిక్ చేయండి.
ఇంకేం.. మీ e-KYC ప్రక్రియ పూర్తయినట్టే.


పిఎం కిసాన్‌ యోజన పథకానికి సంబంధించి ఏమైనా ఫిర్యాదులు ఉంటే..
పిఎం కిసాన్‌ యోజన పథకానికి సంబంధించి 13వ ఇన్‌స్టాల్‌మెంట్ మీ ఖాతాలోకి ఇంకా క్రెడిట్ అవకపోతే, మీరు హెల్ప్‌లైన్ నంబర్ 155261 లేదా 1800115526 లేదా ఈ నంబర్‌లో 011-23381092ను సంప్రదించి సమస్యను పరిష్కారం చేసుకోవచ్చు. అంతేకాకుండా pmkisan-ict@gov.in ఇమెయిల్ ఐడికి మీ సమస్యను మెయిల్ చేయడం ద్వారా కూడా మీ సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చు.


ఇది కూడా చదవండి : Rs 2,000 Notes In ATMs: ఏటీఎంలలో 2000 నోట్లు ఎందుకు లేవు.. స్పందించిన కేంద్ర మంత్రి


ఇది కూడా చదవండి : Modi Htao Desh Bachao : కలకలం రేపుతున్న మోదీ హఠావో దేశ్ బచావో పోస్టర్లు.. ఆరుగురు అరెస్ట్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK