PM Kisan 17th Installment: కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే పీఎం కిసాన్ డబ్బులు వారి ఖాతాలో జమా కానున్నాయి. 17 విడత డబ్బులు వారి ఖాతాల్లో జమా కానున్నాయి. ఈ పథకానికి అర్హులైనవారి ఖాతాల్లో రూ.2 వేలు జమా కానున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న అర్హులైన రైతులకు ఏడాదికి రూ. 12 వేలు అందిస్తోంది. ఇక మరో విడత డబ్బులు మే మొదటివారంలో చేయనుంది.ఈ పథకం ద్వారా ప్రతి ఏడాది నాలుగు నెలలకు ఒకసారి మూడు విడతలుగా డబ్బు జమా చేస్తుంది. ఏడాదికి రైతుకు రూ. 12 వేల ఆర్థిక సాయం అందుతోంది. వచ్చే నెల లోక్‌ సభ ఎన్నికల నేపథ్యంలో ముందుగానే డబ్బులు జమా అయ్యే అవకాశం ఉంది. ఈ పథకానికి అర్హులైన వారు ఈకేవైసీ చేసుకోవాలి.
 
ఈ పథకానికి అర్హత 18 ఏళ్లు పైబడినవారు. ఆధార్ కార్డు, అడ్రస్, ప్యాన్ కార్డ్‌ కలిగి ఉండాలి. పీఎం కిసాన్ జాబితాను అధికారిక వెబ్‌సైట్‌ https://pmkisan.gov.in. చెక్‌ చేసుకోవచ్చు. ఈ జాబితాలో పీఎం కిసాన్ అర్హులైనవారి జాబితా ఉంటుంది.  ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనా కింద 17 విడత డబ్బులు రైతుల ఖాతాల్లో డైరెక్ట్‌ బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ చేస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 17 విడత పీఎం కిసాన్ జాబితాను మే లో విడుదల చేయనున్నారు. ప్రధానంగా  చిన్న సన్నకారు రైతులకు ఆర్థికంగా చేయూతనందించడానికి ఈ పథకాన్ని ప్రారంభించారు. బ్యాంక్ ఖాతాల్లో నేరుగా రూ.2 వేలు జమా అవుతాయి. 16వ విడత డబ్బులు ఫిబ్రవరి 28న విడుదల చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదీ చదవండి: తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన తేదిలు ఖరారు..


పీఎం కిసాన్ పథకానికి కావాల్సిన డాక్యుమెంట్లు..
ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫోట్, అడ్రస్‌ ప్రూఫ్, క్యాస్ట్ సర్టిఫికేట్, మొబైల్‌ నంబర్, ఇమెయిల్ ఐడీ కలిగి ఉండాలి. 17 విడత పీఎం కిసాన్ అర్హులైన వారి జాబితాను ఈ లింక్‌ ద్వారా తెలుసుకోండి.


పీఎం కిసాన్ స్టేటస్‌ చెక్ చేసుకునే విధానం..
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన https://pmkisan.gov.in అధికారిక వెబ్‌సైట్‌ ఓపెన్ చేయాలి
అందులో హోంపేజీలో Know Your Status బట్టన్ క్లిక్ చేయాలి. 
ఆ తర్వాత ఒక కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. మీ మొబైల్ నంబర్ లేదా అప్లికేషన్ నంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత వ్యూ స్టేటస్ బట్టన్ క్లిక్ చేస్తే వివరాలు ఓపెన్ అవుతాయి.


ఇదీ చదవండి: రెండో విడత ఎన్నికల ప్రచారానికి తెర.. కేరళ, కర్ణాటక సహా 89 లోక్ సభ సీట్లకు రేపే పోలింగ్..


పీఎం కిసాన్ అర్హుల జాబితా డౌన్ లోడ్ చేసుకునే విధానం..


పీఎం కిసాన్ అధికారికి వెబ్‌సైట్‌ https://pmkisan.gov.in ఓపెన్‌ చేయాలి. 
ఆ తర్వాత ఓ హోం పేజీ ఓపెన్ అవుతుంది.
అందులో బెనిఫిషియరీ లిస్ట్‌ ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే ఓ కొత్త స్క్రీన్ ఓపెన్ అవుతుంది.
మీ జిల్లా, రాష్ట్రం, సబ్‌ డిస్ట్రిక్, తహసీల్‌, విలేజ్, బ్లాక్ నమోదు చేయాల్సి ఉంటుంది. 
ఆ తర్వాత దరఖాస్తు దారుడి పేరు, అప్లికేషన్ నంబరర్ ఎంటర్ చేయాలి. చివరగా సబ్మిట్‌ బటన్ నొక్కితే బెనిఫిషీయరీ లిస్ట్‌ ఓపెన్ అవుతుంది.
దీన్ని డౌన్‌ లోడ్‌ చేసుకుని పెట్టుకోవాలి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook