Mann ki Baat: కరోనా వ్యాక్సిన్ పట్ల ప్రజల్లో ఆత్మ విశ్వాసం పెరిగింది. భారతీయ వ్యాక్సిన్‌ను ప్రపంచ దేశాలు ప్రశంసిస్తున్నాయి. మన్ కీ బాత్  కార్యక్రమంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలివి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కోవిడ్ వ్యాక్సినేషన్ ( Covid Vaccination ) ప్రక్రియపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ ( Narendra modi ) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం ఇండియాలో జరుగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ ( Pm Narendra modi ) తెలిపారు. కేవలం 15 రోజుల వ్యవధిలో 30 లక్షల మందికి వ్యాక్సిన్ వేశామని చెప్పారు మోదీ. మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా మోదీ ఈ వ్యాక్సినేషన్ గురించి మాట్లాడారు. ఈ ఏడాది తొలి మన్ కీ బాత్ ( First Mann ki Baat ) కార్యక్రమమిదే. బ్రెజిల్ రాష్ట్రపతి సైతం భారత్ వ్యాక్సిన్‌ను ప్రశంసించారన్నారు.  మరోవైపు గణతంత్ర దినోత్సవం రోజున జరిగిన ఘటన గురించి ప్రస్తావించారు. ఎర్రకోట సాక్షిగా జాతీయ పతాకానికి జరిగిన అవమానం దేశం మొత్తానికి దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు మోదీ. జనవరి 26న జరిగిన ట్రాక్టర్ ర్యాలీలో కొంతమంది ఎర్రకోటపై ఖల్సా జెండాను ఎగురవేయడం గురించి ప్రధాని మోదీ మాట్లాడారు. 


అమెరికా వంటి అగ్రరాజ్యానికి వ్యాక్సినేషన్‌లో 30 లక్షల మార్కు దాటేందుకు 18 రోజులు పట్టిందని..బ్రిటన్ దేశానికి 36 రోజులు పట్టిందని చెప్పారు. మేడిన్ ఇండియా ( Made in India )లో భాగంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ దేశ ఆత్మగౌరవానికి ప్రతీక అని ఆయన అన్నారు. మరోవైపు ఆస్ట్రేలియాలో భారత జట్టు విజయం పట్ల అభినందనలు తెలిపారు. 


Also read: Bombay High court Judgement: వివాదాస్పద తీర్పుపై రంగంలో దిగిన ఉద్ధవ్ థాకరే, స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలుకు నిర్ణయం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook