One Nation One Election Update: మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ ఆలోచన మారబోతుందా..? ఎప్పటి నుంచో చర్చ జరుగుతున్న జమిలి ఎన్నికలపై బీజేపీ ఇక ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందంటారు రాజకీయ విశ్లేషకులు. మహారాష్ట్రలో వన్ సైడ్ విక్టరీతో  బీజేపీ మంచి ఊపు మీద ఉంది. మహా రిజల్స్ ఇచ్చిన జోష్ తో  ఇక దేశ వ్యాప్తంగా ఒకే సారి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం సిద్దమవుతుందని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే దేశంలోని మెజార్టీ రాష్ట్రాల్లో బీజేపీ, ఆ పార్టీ కూటమికీ సంబంధించినే పార్టీలే అధికారంలో ఉన్నాయి. దీంతో జమిలి ఎన్నికలు నిర్వహించడానికి ఇదే సరైన సమయమని బీజేపీ భావిస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దీనిలో భాగంగా వచ్చే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో జమిలి ఎన్నికలకు సంబంధించిన కీలక బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలనుకుంటుంది. ఈ బిల్లుకు లోక్ సభ, రాజ్యసభలో ఎలాగో ఇబ్బంది లేదు. దీంతో జమిలీ ఎన్నికల బిల్లుకు ఎలాంటి ఆటంకాలు ఉండకపోవచ్చనేది విశ్లేషకుల అంచనా. ఆ తర్వాత ఇక జమిలి ఎన్నికలకు సంబందించి ఏర్పాట్లపై ఎన్నికల కమిషన్ దృష్టి పెట్టనుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కేంద్రం జమిలి ఎన్నికలకు వెళ్లడానికే సిద్దపడుతున్నట్లు ఢిల్లీలో ప్రచారం జరగుతుంది.దేశంలో ఎప్పుడూ ఏదో చోట ఎన్నికలు జరగడం వల్ల దేశ అభివృద్ధికి తీవ్ర ఆటంకం కలుగుతుందనేది బీజేపీ ఉద్దేశం. దీంతో ఈ పరిస్థితులకు ఎలాగైనా చెక్ పెట్టాలని మోదీ, అమిత్ షా ఎప్పటి నుంచో అనుకుంటున్నారు.



గతంలో రెండు పర్యాయాలు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. మూడో సారి కూడా మోదీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలోకి వచ్చింది. మొన్న జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లుపైగా వస్తాయని భారీ ఆశలు పెట్టుకుంది కానీ కేవలం 240 సీట్లకు మాత్రమే పరిమితం అయ్యింది. ఇదే బీజేపీనీ జమిలి వైపు ఆలోచించ చేసిందని అంటున్నారు. బీజేపీకీ సీట్లు తగ్గడం పై మోదీ అమిత్ షాతో పాటు ఆర్ఎస్ఎస్ కూడా తీవ్ర అసంతృప్తిలో ఉంది. దీంతో జిమిలి ఎన్నికలు తెరపైకి వచ్చాయని అంటున్నారు. బీజేపీ జమిలీ ఎన్నికలపై ఎందుకు అంతలా సీరియస్ గా ఉందనే దానిపై కూడా రకరకాలుగా ప్రచారం జరుగుతుంది.అందులో భాగంగా ప్రధానంగా ఒక వాదన వినిపిస్తుంది బీజేపీ, దాని అనుబంధ సంస్థ ఐనా ఆర్ఎస్ఎస్ కు ఒక కల ఉందంట.ఎప్పటికైనా దేశం అంతటా కాషాయపు జెండా రెపరెపలాడాలన్నదే వారి ఆశయం అట. అందులో భాగంగానే ఈ జమిలి ఎన్నికలను తెరపైకి తెచ్చారన్న పొలిటికల్ అనలిస్ట్ లు భావిస్తున్నారు.


ఇప్పుడున్న పరిస్థితుల్లో జిమిలీ జరిగితే అది బీజేపీకీ భాగా లబ్ది చేకూర్చుతుందని నమ్ముతున్నారు. జమిలీ ఎన్నికల తర్వాత కేంద్రంతో పాటు దేశంలోని 90శాతం పైగా రాష్ట్రాల్లో  కాషాయపు జెండా ఎగరడం ఖాయం అని భావిస్తున్నారు. తద్వార బీజేపీ తీసుకోవాలనుకుంటున్న నిర్ణయాలకు తిరుగు ఉండదని అనుకుంటున్నారు. అందుకే జమిలికీ బీజేపీ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని చెబుతున్నారు. తాజగా ఇప్పుడు మహారాష్ట్రలో గ్రాండ్ విక్టరీ సాధించడంతో ఇక జమిలీ ఖాయమని దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఎన్డీయే కూటమి పార్టీలకు జమిలీపై ఒక సంకేతం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. 2027లో జమిలీ ఎన్నికలను నిర్వహించేందుకు కేంద్రం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.


జమిలీ ఎన్నికలకు సంబంధించి వచ్చే రెండు మూడు నెలలు అత్యంత కీలకమని ఢిల్లీ అధికార వర్గాలు చెబుతున్నాయి. దీనిపై ఇప్పటికే కేంద్రం న్యాయ సలహాలు కూడా తీసుకుంటుందని. దీనిపై చట్టం తీసుకురావడమే తరువాయి అని కూడా వారు చెబుతున్నారు. ఒక సారి కేంద్రం జమిలికి సై అంటే ఇక ఎన్నికల కమిషన్ ఎన్నికల ఏర్పాట్లుకు సంబందించి ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించనుంది. దేశంలోని మెజార్టీ రాజకీయ పార్టీలు కూడా జమిలికి అనుకూలంగానే ఉన్నారు. కాంగ్రెస్ కూడా జమిలి వస్తేనే తమకు లాభం జరుగుతుందని భావిస్తుంది. కానీ కొన్ని ప్రాంతీయ పార్టీలు మాత్రం దీనిపై భిన్నంగా స్పందిస్తున్నాయి. రీజనల్ పార్టీలు కొన్ని వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు సై అంటే మరి కొన్ని మాత్రం నై అంటున్నాయి.


మొత్తానికి మహారాష్ట్ర ఎన్నికలు జమిలి ఎన్నికలకు బీజం వేస్తాయని అందరూ అనుకుంటున్నారు. గెలుపుతో జోష్ లో ఉన్న బీజేపీ ఇక తన తదుపరి లక్ష్యం జమిలీ అనే అంచనా వేస్తున్నారు. జమిలీకి సంబందించి కీలక ఘట్టం రాబోయే కొద్ది రోజుల్లో జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.


ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter