న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో ఏప్రిల్ 14 తర్వాత లాక్ డౌన్ కొనసాగిస్తారా లేదా అనేదే ప్రస్తుతం యావత్ భారతీయుల మెదళ్లను తొలిచేస్తోన్న ప్రశ్న. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను పరిశీలిస్తే లాక్ డౌన్ ఎత్తేసే పరిస్థితే కనిపించడం లేదు కానీ ఈ విషయంలో కేంద్రం ఏ రకమైన నిర్ణయం తీసుకుంటుందనేది ప్రస్తుతానికి ఆసక్తికరంగామారింది. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ ఫ్లోర్ లీడర్లతో బుధవారం వీడయో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైన ప్రధాని నరేంద్ర మోదీ వారి సలహాలు, సూచనలు కూడా సావధానంగా విన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ఏప్రిల్‌ 14న లాక్‌డౌన్‌ ఎత్తివేయడం సాధ్యం అయ్యేటట్టు లేదని చెప్పకనే చెప్పేశారు. మేధావులు, ప్రజలు సైతం లాక్ డౌన్‌ని కొనసాగించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారని అన్నారు. కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుండమే అందుకు కారణమని ప్రధాని చెప్పుకొచ్చారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read : EPF withdrawal: కరోనా క్రైసిస్‌లో ఆర్థిక ఇబ్బందులు తీరాలంటే ఇలా చేయండి


లాక్‌డౌన్‌ని ఒక్కసారిగా ఎత్తివేయలేమని.. లాక్ డౌన్ ఎత్తివేత, కొనసాగింపు విషయంపైనే అన్నిపక్షాల సలహాలను పరిగణనలోకి తీసుకుంటున్నామని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కాంగ్రెస్‌ పార్టీ తరపున ఎంపీ గులాం నబీ ఆజాద్‌, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయి రెడ్డి, లోక్‌సభా పక్ష నేత మిథున్‌ రెడ్డి, టీడీపీ తరపున గల్లా జయదేవ్, డీఎంకే పార్టీ నుంచి టీఆర్ బాలు, లోక్ జనశక్తి (ఎల్‌జేపి) నుంచి చిరాగ్ పాశ్వాన్, శిరోమణి అకాలి దళ్ నుంచి సుఖ్‌బీర్ సింగ్ బాదల్,  శివసేన పార్టీ తరపున సంజయ్‌ రావత్‌, బిజు జనతాదళ్‌ నుంచి పినాకీ మిశ్రా, బహుజన్‌ సమాజ్‌ పార్టీ ఎంపీ ఎస్‌సీ మిశ్రా, ఎన్సీపీ నుంచి ఆ పార్టీ అధినేత శరద్‌ పవార్‌, జనతాదళ్‌ నుంచి రాజీవ్‌ రంజన్‌ సింగ్‌, సమాజ్‌వాదీ పార్టీ తరపున రామ్‌ గోపాల్‌ యాదవ్‌, టీఆర్ఎస్ తరపున కే కేశవరావు, నామా నాగేశ్వర రావు సహా ఇతర పార్టీల ఎంపీలు పాల్గొన్నారు.


తొలుత ఈ వీడియో కాన్ఫరెన్స్‌పై పెదవి విరుస్తూ ఆసక్తి కనబర్చని టీఎంసీ పార్టీ సైతం చివరకు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొంది. తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎంపీ సుదీప్‌ బంధోపాధ్యాయ్‌ ఈ సమావేశంలో పాల్గొన్నారు. 


Also read : Liquor Home delivery: లాక్ డౌన్ సమయంలో మద్యం హోమ్ డెలివరీ


ఏప్రిల్ 11న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయాలు తీసుకుని.. వారి మెజార్టీ ఏంటో అభిప్రాయం కూడా తెలుసుకోవాలని ప్రధాని మోదీ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 11 సమావేశం తర్వాతే లాక్ డౌన్‌పై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..