Pm modi: పాక్ దమ్మేంటో అప్పుడే చూశా.. మరోసారి పంచ్ లు వేసిన ప్రధాని మోదీ..
Pm modi on pakistan: ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ లోని పటియాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన పాక్ పై, కాంగ్రెస్ పార్టీపై మరోసారి విరుచుకుపడ్డారు.
Pm modi hot comments on Pakistan: దేశంలో ఎన్నికలు చివరి దశలకు చేరుకున్నాయి. అయిన కూడా పొలిటికల్ హీట్ మాత్రం తగ్గడంలేదు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ లోని పటియాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కొందరు పాక్ వద్ద అణుబాంబు ఉందని, ఆ దేశాన్ని గౌరవించాలనంటూ వ్యాఖ్యలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తాను 2015 సంవత్సరంలోనే పాక్ కు వెళ్లి వారీ కెపాసిటీ ఏంటో చూసి వచ్చానని చెప్పారు. మరో ట్విస్ట్ ఏంటంటే కనీసం వీసా కూడా లేకుండానే తాను పాక్ లోని లాహోర్ కు వెళ్లానని చెప్పుకొచ్చారు. అక్కడి జర్నలిస్టు తనను దీనిపై ప్రశ్నించగా పాక్ .. ఇది ఒకప్పుడు మా దేశంలోని అంతర్భాగమేనని చెప్పానంటూ అప్పటి మాటల్ని మరోసారి గుర్తు చేసుకున్నారు. మణిశంకర్ అయ్యార్ లాంటి వాళ్ల, కాంగ్రెస్ నేతలు పాక్ ను చూసి భయపడుతున్నారని, తమకు అలాంంటి అవసరం లేదని మోదీ తెల్చిచెప్పారు.
Read more: Drunken couple: తప్పతాగి రోడ్డు మీద హల్ చల్.. వాకర్స్ మీద రెచ్చిపోయిన యువతి.. వీడియో వైరల్..
ఇటీవల పాక్ కొంత ఆందోళన చెందడానికి తాను కూడా ఒక కారణం అంటూ సెటైర్ లు వేశారు. 1971 లో భారత్ - పాక్ మధ్య జరిగిన యుద్ధం జరిగింది. ఆసమయంలో 90 వేల మంది పాకిస్థాన్ సైనికులు లొంగి పొవడం జరిగింది. కానీ ఆసమయంలో తాను ప్రధానిగా ఉంటే మాత్రం.. పాక్ కు గట్టిగా బుద్ధి చెప్పేవాడినని అన్నారు. వారి సైనికులను విడుదల చేయాలంటే, పవిత్రమైన కర్తార్ పుర్ సాహిబ్ ను వెనక్కి ఇచ్చేయాలని కండీషన్ పెట్టేవాడినని మోదీ అన్నారు.
కాంగ్రెస్ నేతలంతా పాక్ వద్ద బూచీని చూసి భయపడుతున్నారని, ఇలాంటి వారు దేశాన్ని ఏవిధంగా ముందుకు తీసుకెళ్తారని సెటైర్ లు వేశారు. ఇక ఇప్పటికే పాక్ పట్ల కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలను యూపీ సీఎం యోగీ కూడా తీవ్రంగా ఖండించారు. వారి వద్ద అణుబాంబులుంటే.. మా దగ్గర ఉన్న అణుబాంబులు ఫ్రిడ్జీలో పెట్టుకొవడానికా అంటూ రివర్స్ కౌంటర్ ఇచ్చారు. కొందరు సర్జీకల్ స్ట్రైక్స్ పై కామెంట్లు చేస్తుంటారు.. ముంబైపై దాడికి పాల్పడిన కసబ్ మనవాడే అంటారు..
Read more: Bhootonwala mandir: ఒక్క రాత్రిలో దెయ్యాలు కట్టిన ఆలయం.. దీని విశిష్టతో ఏంటో తెలుసా..?
ఇలాంటి వ్యాఖ్యలు విన్నప్పుడు తనకు సిగ్గుతో తలతీసేసినట్లు ఉంటుందని మోదీ కాంగ్రెస్ ను ఏకీపారేశారు. అదే విధంగా.. 2015 డిసెంబరు 25 వ తేదీన ఆఫ్ఘనిస్థాన్ పర్యటనకు వెళ్లినట్లు గుర్తు చేశారు. అప్పుడు భారత్ కు వస్తుండగా.. దాయాదీ దేశం పాక్ కు వెళ్లి నవాబ్ షరీఫ్ కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పినట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. 2004 తర్వాత భారత్ పాక్ సంబంధాలు అంతచెప్పుకొగ్గవిగా లేవు. పాక్ ఎప్పుడు చూసి బార్డర్ వద్ద కవ్వింపు చర్యలకు పాల్పడుతూ వస్తుంది. ఈ క్రమంలో.. 2004 తరర్వాత పాక్ లో మోదీ అడుగు పెట్టి అందరిని ఆశ్చర్యానికి గురిచేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter