నా రాజకీయ బలం చూసి ప్రధాని నరేంద్రమోదీ భయపడుతున్నారని, అందుకే తమపై ఆరోపణలు చేస్తున్నారని కర్ణాటక సీఎం సిద్దరామయ్య వ్యాఖ్యానించారు. సోమవారం బెంగళూరు నగరంలోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ- "ఇటీవల గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెంగళూరులో రాజభోగాలు కల్పించారని మోదీ ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనను చూసి అసహనంతో ఆయన ఈ ఆరోపణ చేసి ఉండవచ్చు. ఈసారి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది.  ఇందుకు ఇటీవల జరిగిన నంజన్గుడ్, గుండ్లుపేట్ ఎన్నికలే నిదర్శనం. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో చాముండేశ్వరి నియోజకవర్గంలో తనను ఓడించడానికి బీజేపీ–జేడీఎస్‌లు ఎన్ని విధాలా ప్రయత్నించినా, సాధ్యం కాదని అన్నారు. " అని అన్నారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బిజెపి 'నీచ రాజకీయాలు' రాజకీయాలకు పాల్పడుతోందని, ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు.  బిజెపి నాయకులకు 'డర్టీ మైండ్'  ఉందని, దేశంలో బహుశా ఏ రాజకీయ పార్టీ ఇంత దిగజారుడు రాజకీయాలు చేయదు. బిజెపి నాయకులు అవాస్తవాలు చేయడం సరికాదని ఆయన ఆరోపించారు.


మిషన్ 50


వచ్చే ఎన్నికల్లో 150 సీట్లను (మిషన్ 150) గెలుచుకోవాలని బిజెపి లక్ష్యంగా పెట్టుకుంది. వారు ఆ లక్ష్యానికి చేరరు. అది 'మిషన్150' కాదు నా దృష్టిలో అది మిషన్ 50'. ఎన్నికల సమయానికి, వారి లక్ష్యాలు మరింత తగ్గవచ్చేమో ' అని బీజీపీని ఉద్దేశించి సిద్దరామయ్య చెప్పారు.