Lata Mangeshkar: అధికారిక లాంఛనాలతో లతా మంగేష్కర్ అంత్యక్రియలు.. హాజరుకానున్న ప్రధాని మోదీ!
Lata Mangeshkar : భారతరత్న పురస్కార గ్రహీత, గాన కోకిల లతా మంగేష్కర్ కన్నుమూశారు. ఇవాళ సాయంత్రం జరిగే ఆమె అంత్యక్రియలకు ప్రధాని మోదీ హాజరుకానున్నారు.
PM Modi likely to attend Lata Mangeshkar funeral: లెజండరీ సింగర్ లతా మంగేష్కర్(92) (Lata Mangeshkar) ఆదివారం ఉదయం కన్నుమూశారు. ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో గత 29 రోజులుగా చికిత్స పొందుతున్న ఆమె ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఇవాళ సాయంత్రం ముంబయిలోని శివాజీ పార్క్‌లో జరిగే లతా మంగేష్కర్ అంత్యక్రియలకు ప్రధాని మోదీ (PM Modi) హాజరు కానున్నారు. ఈ సందర్భంగా సాయంత్రం 4.15నిమిషాలకు మోదీ ముంబయి చేరుకుంటారు. అక్కడి నుంచి శివాజీ పార్క్‌కు వెళ్లి లత పార్థివదేహానికి నివాళులు అర్పించనున్నారు.
భారతదేశపు నైటింగేల్‌గా పిలవబడే మంగేష్కర్ అంత్యక్రియలు ముంబైలోని శివాజీ పార్క్‌లో (Shivaji Park in Mumbai) సాయంత్రం 6.15 గంటలకు పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించబడతాయి. కేంద్ర ప్రభుత్వం రెండు రోజుల జాతీయ సంతాప దినాలను ప్రకటించింది. గౌరవ సూచకంగా రెండు రోజుల పాటు జాతీయ జెండాను అవనతం చేయాలని సూచించింది. అధికార లాంఛనాలతో లతా మంగేష్కర్ అంత్యక్రియలు నిర్వహిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటికే ఆమె మృతిపట్ల పలువురు రాజకీయ సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
Also Read: Lata Mangeshkar's death news: లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ కన్నుమూత
Also Read: Lata Mangeshkar: లతా మంగేష్కర్ కు టాలీవుడ్ ఇండస్ట్రీ నివాళి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook