గ్రేటర్ నోయిడాలో ప్రపంచ స్థాయి అంతర్జాతీయ విమానాశ్రయం రానుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ మద్యాహ్నం శంకుస్థాపన చేయనున్న ఈ విమానాశ్రయానికి ఓ ప్రత్యేకత ఉంది. అదేంటో చూద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఢిల్లీ ఎన్‌సీఆర్ పరిధి..ఉత్తరప్రదేశ్ గ్రేటర్ నోయిడాలోని (Greater Noida)జేవార్‌లో ప్రతిపాదిత అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధాని నరేంద్ర మోదీ(Narendra modi) ఇవాళ మద్యాహ్నం శంకుస్థాపన చేయనున్నారు. దాదాపు 1330 ఎకలా విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ విమానాశ్రయం సెప్టెంబర్ 2024 నాటికి కార్యకలాపాలు పూర్తి చేస్తుందని భావిస్తున్నారు. నాలుగు దశల్లో ఈ విమానాశ్రయాన్ని నిర్మించనున్నారు. తొలిదశలో 8 వేల 194 కోట్ల పెట్టుబడితో విమానాశ్రయం అభివృద్ధి కానుంది. ప్రతి యేటా 12 మిలియన్ల మంది రాకపోకలు సాగిస్తారనేది అంచనా. 


ప్రాజెక్టు ప్రత్యేకత


ఈ విమానాశ్రయం పూర్తయితే ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద విమానాశ్రయం(World Fourth Largest Airport) కానుంది. అంతేకాకుండా 70 కిలోమీటర్ల పరిధిలో మూడు విమానాశ్రయాలు కలిగిన తొలి నగరంగా ఢిల్లీ ఖ్యాతినార్జిస్తుంది. ఢిల్లీ, జెవార్‌లు అంతర్జాతీయ స్థాయి కాగా, ఘజియాబాద్‌లోని హిండన్ విమానాశ్రయంలో దేశీయ విమానాలు నడుస్తాయి. ఈ విమానాశ్రయంలో రెండు ఎయిర్‌స్ట్రిప్‌లు పనిచేస్తాయి. ఈ విమానాశ్రయ అభివృద్ధి కాంట్రాక్టు జ్యూరిచ్ ఎయిర్‌పోర్ట్ ఇంటర్నేషనల్ సంస్థకు దక్కింది. నాలుగు దశల నిర్మాణం అనంతంర సామర్ధ్యం 70 మిలియన్ ప్రయాణీకులకు చేరనుంది. ఢిల్లీతో పాటు నోయిడా, ఘజియాబాద్, అలీగఢ్, ఆగ్రా, ఫరీదాబాద్ పరిసర ప్రాంతాల ప్రజలకు ఈ విమానాశ్రయం ద్వరా ప్రయోజనం కలుగుతుంది. జేవార్ విమానాశ్రయం ఉత్తర భారతదేశానికి ప్రవేశద్వారంగా మారనుందని..యూపీ(Uttar pradesh) రూపురేఖల్ని మారుస్తుందని పీఎంవో కార్యాలయం ప్రకటించింది.


జేవార్ విమానాశ్రయం(Jewar Airport) 5 వేల 845 హెక్టార్ల విస్తీర్ణంలో నిర్మితం కానుంది. తొలిదశలో మాత్రం 1334 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. తొలిదశలో రెండు ప్యాసెంజర్ టెర్మినల్స్, రెండు రన్‌వేలు ఉంటాయి. ఆ తరువాత మొత్తం ఐదు రన్‌వేలు నిర్మిస్తారు. ట్రాఫిక్ పెరిగే కొద్దీ రన్‌వేల సంఖ్య పెరగవచ్చు. 


Also read: Cash in drainage pipe: డ్రైనేజీ పైపులో లక్షల కొద్ది అవినీతి సొమ్ము.. ఏసీబీ సోదాల వీడియో వైరల్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook