Vaccination: వ్యాక్సినేషన్లో నిరుత్సాహం వద్దు - ప్రధాని మోదీ
Covid-19 vaccination :కేంద్రం ఒక పక్క 100 కోట్లకు పైగా డోసులు సరఫరా చేసి దూసుకెళ్తున్నా కూడా కొన్ని చోట్ల ఉన్న అవాంతరాలను అధిగమించేందుకు ఈ సమావేశం నిర్వహించింది.
PM Modi to meet officials of 40 districts with low Covid-19 vaccination numbers: కరోనా (Corona) టీకా డోసుల పంపిణీలో వెనకబడిన జిల్లాల కలెక్టర్లతో ప్రధాని నరేంద్రమోదీ తాజాగా సమీక్ష నిర్వహించారు. మొదటి డోసు విషయంలో 50 శాతం కంటే తక్కువ కవరేజ్, రెండో డోసు (Second dose) ఇవ్వడంలో వెనకబడిన 40 జిల్లాల అధికారులతో నరేంద్రమోదీ మాట్లాడారు. జార్ఖండ్, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, మేఘాలయలోని పలు జిల్లాలు ఈ జాబితాలో ఉన్నాయి.
ఆయా రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో టీకా పంపిణీ (Vaccine distribution) తక్కువగా ఉంది. కేంద్రం ఒక పక్క 100 కోట్లకు పైగా డోసులు సరఫరా చేసి దూసుకెళ్తున్నా కూడా కొన్ని చోట్ల ఉన్న అవాంతరాలను అధిగమించేందుకు ఈ సమావేశం నిర్వహించింది.
కేంద్రం ఇప్పటివరకు 114 కోట్లకు పైగా టీకా డోసుల్ని (Vaccine dosage) పంపిణీ చేసింది. అయితే దాదాపు 14కోట్లకు పైగా డోసులు రాష్ట్రాల వద్ద నిల్వ ఉన్నాయి. ఈ స్థాయిలో వ్యాక్సిన్ డోసులు (Vaccine doses) నిల్వ ఉండటంపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది. టీకా పంపిణీ వేగం నిదానించడంపై కేంద్రం ఆందోళన చెందుతోంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ప్రధాని ఈ సమీక్ష నిర్వహించారు.
Also Read : Viral Video: ఈ కాకి హొయలు, వంపులు చూసారా..? 'క్యాట్ వాక్‌తో' అదరగొట్టేసిన 'కాకి'
టీకా కార్యక్రమంలో మైలురాళ్లు దాటడంలో వైద్య సిబ్బంది కృషి ఎనలేనిదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ 100 కోట్ల డోసుల పంపిణీ తర్వాత మనం నిరుత్సాహం కనబరిస్తే కొత్త సంక్షోభం వచ్చే అవకాశం ఉంటుందిన మోదీ తెలిపారు. ఈ వంద ఏళ్లలో చూడని ఈ మహమ్మారి వల్ల మనకు అనేక సవాళ్లు ఎదురయ్యాయని మోదీ గుర్తు చేశారు.
ఈ సమయంలో కొత్త పరిష్కారాలు కనుగొని ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. మీరు కూడా టీకా పంపిణీని (Vaccine distribution) వేగవంతం చేయడంలో కొత్త పద్ధతుల్ని ఉపయోగించాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు.
Also Read : AP High Court: న్యాయమూర్తుల్ని చులకన చేయడం మీకు కాలక్షేపమా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి