AP High Court: న్యాయమూర్తుల్ని చులకన చేయడం మీకు కాలక్షేపమా

AP High Court: ఏపీ హైకోర్టుకు కోపమొచ్చింది. న్యాయమూర్తుల్ని చులకన చేస్తూ మాట్లాడటంపై కీలక వ్యాఖ్యలు చేసింది. న్యాయమూర్తుల్ని చులకన చేయడం కొందరికి కాలక్షేపంగా మారిందని వ్యాఖ్యానించింది. అసలేం జరిగిందంటే  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 3, 2021, 02:57 PM IST
  • సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులపై ఏపీ హైకోర్టులో విచారణ
  • న్యాయమూర్తుల్ని చులకన చేయడం కొందరికి కాలక్షేపంగా మారిందని వ్యాఖ్య
  • న్యాయమూర్తులపై వ్యాఖ్యలు న్యాయ ప్రతిష్ఠను దెబ్బతీస్తాయని వెల్లడి
AP High Court: న్యాయమూర్తుల్ని చులకన చేయడం మీకు కాలక్షేపమా

AP High Court: ఏపీ హైకోర్టుకు కోపమొచ్చింది. న్యాయమూర్తుల్ని చులకన చేస్తూ మాట్లాడటంపై కీలక వ్యాఖ్యలు చేసింది. న్యాయమూర్తుల్ని చులకన చేయడం కొందరికి కాలక్షేపంగా మారిందని వ్యాఖ్యానించింది. అసలేం జరిగిందంటే

సామాజిక మాధ్యమాల్లో న్యాయవ్యవస్థపై అభ్యంతరకర పోస్టుల విషయంలో ఏపీ హైకోర్టులో(Ap High court)విచారణ జరిగింది. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ దాఖలు చేసిన పిటీషన్‌పై హైకోర్టు జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర, జస్టిస్ కే లలితతో కూడిన ధర్మాసనం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కీలకమైన వ్యాఖ్యలు చేసింది. 

హైకోర్డు ఏం చెప్పిందంటే..విచారణలను ప్రభావితం చేసే భావ వ్యక్తీకరణ, వాక్‌ స్వాతంత్య్రాలను భారత రాజ్యాంగం ప్రజలకు ప్రసాదించింది. కానీ న్యాయవ్యవస్థ అందరికీ సులువైన లక్ష్యంగా మారింది. రాజకీయ ప్రత్యర్థులు న్యాయ విచారణలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించడంతో పాటు న్యాయమూర్తులను బెదిరిస్తున్నారు. తీర్పులపై అభ్యంతరమున్నవారు న్యాయమూర్తులకు దురుద్దేశాలు ఆపాదిస్తున్నారు. సామాన్యుడి హింస కంటే న్యాయ కోవిదుడి మౌనం మరింత హాని చేస్తుంది. సమాజంలో అశాంతిని సృష్టించేందుకు విమర్శ అనేది రెండువైపులా పదునున్న ఖడ్గంగా మారకూడదు అని ఉత్తర్వుల్లో పేర్కొంది.

కొంతమంది వ్యక్తులకు న్యాయమూర్తులను చులకన చేయడం(Comments on Judiciary)కాలక్షేపంగా మారిందని ఏపీ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆ తరహా వ్యాఖ్యలు మంచివి కావని.. అవి న్యాయప్రతిష్ఠను దిగజార్చుతాయని తెలిపింది. న్యాయమూర్తులను చులకన చేయడంతో పాటు వారిపై నిందాపూర్వక వ్యాఖ్యలు, దూషణలు చేయడం కొంతమందికి కాలక్షేపంగా మారిందని ఆంధ్రప్రదేశ్​ హైకోర్టు ఆక్షేపించింది. ఆ తరహా వ్యాఖ్యలు న్యాయస్థానాల ప్రతిష్ఠను దిగజారుస్తాయని పేర్కొంది. దేశంలో సీబీఐ ఉత్తమ దర్యాప్తు సంస్థగా పేరుగాంచిందని, న్యాయస్థానాలకు సీబీఐపై గౌరవముందని తెలిపింది. అయితే ప్రస్తుత కేసులో న్యాయస్థానం పలుమార్లు ఆదేశాలు జారీచేసినా సీబీఐ దర్యాప్తులో పురోగతి లేదని మండిపడింది. దర్యాప్తు పురోగతి, తదుపరి తీసుకోనున్న చర్యలపై అఫిడవిట్‌ వేయాలని సీబీఐ (CBI) డైరెక్టర్‌ను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.

Also read: Southern Zonal Council: సదరన్ జోనల్ కౌన్సిల్‌కు ఆతిధ్యమివ్వనున్న ఏపీ ప్రభుత్వం, ఏర్పాట్లపై సమీక్ష

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News