PM Kisan 10th Installment: కొత్త సంవత్సరాన్ని (New year 2022) పురస్కరించుకుని జనవరి 1న ప్రధాని మోదీ (PM Modi) పీఎం కిసాన్ నిధులను విడుదల చేయనున్నారు.  ప్రధాన మంత్రి కిసాన్​ సమ్మాన్​ నిధి (Pradhan Mantri Kisan Samman Nidhi) పథకానికి సంబంధించిన పదో విడత నిధులను (PM Kisan 10th Installment) మోదీ విడుదల చేయనున్నారు. ఈ విడత కింద రూ.20వేల కోట్లను విడుదల చేయనున్నారు. దీంతో దేశవ్యాప్తంగా 10కోట్లకు పైగా రైతు కుటుంబాలకు లబ్ధి పొందనున్నాయి. ఈ నిధులు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్​ చేస్తామని ప్రధానమంత్రి కార్యాలయం (PMO) వెల్లడించింది. ఇప్పటివరకు రూ. 1.6లక్షల కోట్లను రైతు కుటుంబాలకు అందించామని తెలిపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జనవరి 1న పీఎం కిసాన్ నిదులు విడుదల చేసే కార్యక్రమంలోనే రైతు ఉత్పత్తి సంస్థ(ఎఫ్‌పీవో)లకూ ఈక్విటీలు విడుదల చేయనున్నారు. సుమారు 351 ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్‌లకు ( Farmer Producer Organizations) రూ. 14 కోట్ల నిధులను విడుదల చేస్తారు. ఈ ఈక్విటీ గ్రాంట్​ వల్ల 1.24 లక్షల రైతులు లబ్ది పొందనున్నారు.


Also Read: Mercedes Maybach S650: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొత్త కారు ప్రత్యేకతలేంటో తెలుసా?


2019లో పీఎం కిసాన్ పథకాన్ని (PM Kisan Scheme) కేంద్రం ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా..ప్రతి యేటా మూడు దఫాల్లో రూ. 2000 చొప్పున మొత్తం రూ. 6000వేలను నేరుగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ చేస్తున్నది. పీఎం కిసాన్‌తోపాటు తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకం ద్వారా నేరుగా రైతులకు నగదును బదిలీ చేస్తోంది. నగదు జమ అయ్యిందో లేదో  పీఎం కిసాన్ వెబ్ సైట్ లేదా మెుబైల్ యాప్ ఉపయోగించి తెలుసుకోవచ్చు. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి