PM KISAN Samman Nidhi Scheme news updates: కోల్‌కతా: పీఎం కిసాన్ సమ్మన్ నిధి పథకాన్ని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అమలు చేయకపోగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను సగం సత్యంతో, వక్రీకరించిన మాటలతో తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. రైతుల సమస్యలను త్వరగా పరిష్కరించాల్సిందిపోయి ప్రధాని ఆ పని చేయకుండా.. రైతుల పట్ల తనకు ఉన్న ఆందోళనను టెలివిజన్ ప్రసంగం ద్వారా చూపించారని ఎద్దేవా చేశారు. పశ్చిమ బెంగాల్‌లో పీఎం కిసాన్ నిధి పథకాన్ని అక్కడి రాష్ట్ర ప్రభుత్వం అమలుచేయకపోవడం వల్ల అక్కడి రైతులు తీవ్రంగా నష్టపోయారని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను తిప్పికొడుతూ శుక్రవారం  సీఎం మమతా బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"పశ్చిమ బెంగాల్ రైతులకు కేంద్రం తీసుకొచ్చిన పిఎం కిసాన్ యోజన పథకం ద్వారా సహాయం చేయాలన్న తన ఉద్దేశాన్ని పిఎం మోదీ బహిరంగంగానే పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లో పీఎం కిసాన్ నిధి పథకాన్ని అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ( West Bengal govt ) అడ్డుకుంటోందని ఆరోపించారు. కానీ అసలు వాస్తవం ఏమిటంటే ప్రధాని మోదీ తన అవాస్తవ ప్రకటనలతో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు'' అని బెనర్జీ ఒక ప్రకటనలో మండిపడ్డారు. 


ప్రధాని నరేంద్ర మోదీ తన టెలివిజన్ ప్రసంగంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీపై నిప్పులు చెరిగారు. ఆమె ప్రభుత్వం రాష్ట్రాన్ని నాశనం చేసిందని, కేంద్రం ప్రవేశపెట్టిన PM-KISAN scheme కింద 70 లక్షల మంది రైతులకు అందాల్సిన ఆర్థిక ప్రయోజనాలు కోల్పోయేలా చేసిందని ఆరోపించారు. పీఎం-కిసాన్ సమ్మాన్ నిధి కింద కేంద్రం సంవత్సరానికి రైతులకు 6,000 ఆర్థిక సాయం చేస్తున్న సంగతి తెలిసిందే. రైతుల ప్రయోజనాలకు సహకరించడానికి తమ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగానే ఉందని మమతా బెనర్జి స్పష్టంచేశారు.


Also read : PM Kisan: రైతుల ఖాతాల్లోకి 18వేల కోట్లు.. విడుదల చేసిన ప్ర‌ధాని మోదీ


తాను ఇప్పటికే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి రెండు లేఖలు రాశానని, రెండు రోజుల క్రితం ఆయనతో కూడా మాట్లాడానని.. తనకు సహకరించడానికి వాళ్లే నిరాకరిస్తున్నారని, పైగా రాజకీయ ప్రయోజనాల కోసం పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వంపైనే దుష్ప్రచారం చేస్తున్నారని మమతా బెనర్జీ ( West Bengal CM Mamatha Banerjee ) ఆగ్రహం వ్యక్తంచేశారు.


కేంద్ర ప్రభుత్వంతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని పథకాలను అమలు చేస్తున్నప్పుడు... రైతులకు మేలు చేసే పీఎం కిసాన్ నిధి పథకానికి ( PM KISAN Samman Nidhi Scheme ) సహకరించకపోవడం అనే ప్రశ్న ఎక్కడి నుంచి ఉత్పన్నమవుతోందని ముఖ్యమంత్రి మమతా బెనర్జి ప్రశ్నించారు.


Also read : How to apply for SBI e-auction: తక్కువ ధరకే ఇల్లు, దుకాణం, ఫ్యాక్టరీ లాంటి ఆస్తులు కావాలా ?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook