PM Kisan Samman Nidhi scheme | న్యూఢిల్లీ: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతుల ఖాతాల్లోకి 18 వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం జమ చేసింది. వర్చువల్‌గా ఈ రోజు రైతులతో జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) మొత్తం నగదును విడుదల చేశారు. కిసాన్ సమ్మాన్ (PM Kisan Samman Nidhi scheme) సాయం దేశవ్యాప్తంగా సుమారు 9 కోట్ల మంది రైతులకు అందనుంది. దీనిలో భాగంగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా రెండు వేల రూపాయాలు జమ అయ్యాయి.
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి (Kisan Samman) పథకాన్ని ప్రధాని మోదీ 2019లో ప్రారంభించారు. రైతులకు పెట్టుబడి సాయం కింద ఏడాదికి ఆరువేలు చొప్పున అందించాలని కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసింది. అయితే ఈ సాయాన్ని మూడు విడుతల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. Also read: Farmer protests: రైతులందరూ ఆ లేఖను చదవాలి: ప్రధాని మోదీ
18 వేల కోట్ల నిధులను విడుదల చేసిన తరువాత పీఎం మోదీ అరుణాచల్ ప్రదేశ్ రైతులతో మాట్లాడారు. కిసాన్ క్రెడిట్ కార్డును ఉపయోగించుకోవాలని పీఎం పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ మొత్తం ఆరు రాష్ట్రాల రైతులతో (farmers) ఆయన వీడియోకాన్పరెన్స్ ద్వారా సంభాషిస్తున్నారు. Also read: Narendra Modi: ఎలాంటి వివక్ష లేకుండా అందరికీ ప్రతిఫలాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook