PM Modi: ఫాలోయింగ్‌లో ప్రధాని మోదీనే నెంబర్ వన్!
PM Narendra Modi Most Followed Active Politician On Twitter: భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలో ప్రపంచంలోనే నెంబర్ వన్ నాయకుడిగా నిలిచారు. ట్విట్టర్‌లో అత్యధిక ఫాలోయర్లు ఉన్న యాక్టివ్ రాజకీయ నాయకులలో నరేంద్ర మోదీ అగ్రస్థానానికి వచ్చారు.
PM Narendra Modi Most Followed Active Politician On Twitter: భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలో ప్రపంచంలోనే నెంబర్ వన్ నాయకుడిగా నిలిచారు. అవును.. సోషల్ మీడియాలో తనదైన ఫాలోయర్లతో దూసుకెళ్తున్నారు భారత ప్రధాని. ట్విట్టర్‌లో అత్యధిక ఫాలోయర్లు ఉన్న యాక్టివ్ రాజకీయ నాయకులలో నరేంద్ర మోదీ అగ్రస్థానానికి వచ్చారు.
ట్విట్టర్‌లో భారత ప్రధాని మోదీని 6.47 కోట్ల మంది ఫాలో అవుతున్నారు. మొన్నటివరకూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫాలోయర్లు 8.87 కోట్ల మంది ఉన్నారు. అయితే నూతన అధ్యక్షుడిపై అధికారిక ప్రకటన నేపథ్యంలో అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌పై దాడులు జరగగా ట్రంప్ ట్విట్టర్ ఖాతాను శాశ్వతంగా తొలగించింది. తద్వారా ట్విట్టర్‌లో అత్యధిక ఫాలోయర్లు కలిగి ఉన్న క్రియాశీల రాజకీయ నాయకుడిగా భారత ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) అవతరించారు.
Also Read: EPF Interest Rate: ఈపీఎఫ్ వడ్డీ ఖాతాకు రాలేదా.. ఇలా ఫిర్యాదు చేయండి
డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ట్విట్టర్ అకౌంట్‌ను తొలగించడంతో ఆ తర్వాతి స్థానంలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ క్రియాశీల రాజకీయ నేతలలో నెంబర్ వన్ అయ్యారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు 12.79 కోట్ల మంది ట్విట్టర్ ఫాలోయర్లు ఉన్నారు. యాక్టివ్ రాజకీయ నాయకులలో అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ను 2.33 కోట్ల మంది నెటిజన్లు ట్విట్టర్‌లో ఫాలో అవుతున్నారు.
Also Read: Gold Price Today: భారీగా పతనమైన బంగారం ధర.. రూ.6వేలు తగ్గిన వెండి ధర
యూఎస్ నూతన అధ్యక్షుడు బైడెన్ కన్నా భారత హోం మంత్రి అమిత్ షాను అధికంగా ట్విట్టర్‌లో ఫాలో అవుతున్నారు. అమిత్ షాకు ట్విట్టర్‌లో 2.42 కోట్ల ఫాలోయర్లు ఉండగా.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను 2.12 కోట్ల మంది ట్విట్టర్‌లో ఫాలోయర్లు ఉన్నారు.
Also Read: Telangana: ధరణి పోర్టల్‌లో మరో కొత్త సదుపాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook