Gold Price Today 11th Jan 2021: భారీగా పతనమైన బంగారం ధర.. రూ.6వేలు తగ్గిన వెండి ధర

నూతన సంవత్సరంలో భారీగా పెరిగిన బంగారం ధరలు తాజాగా పతనమవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు క్షీణించాయి. 

  • Jan 11, 2021, 08:17 AM IST

Gold Rate Update 11th January 2021: నూతన సంవత్సరంలో భారీగా పెరిగిన బంగారం ధరలు తాజాగా పతనమవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు క్షీణించాయి. 

1 /4

నూతన సంవత్సరంలో భారీగా పెరిగిన బంగారం ధరలు తాజాగా పతనమవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు(Gold Price Today) క్షీణించాయి. కరోనా వైరస్ వ్యాప్తి సమయం నుంచి దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. నూతన సంవత్సరంలో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ రాజధానిలో ధరలు క్షీణిస్తున్నాయి.

2 /4

తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ, హైదరాబాద్‌ (Hyderabad)లలో బంగారం ధర 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,300 మేర దిగొచ్చింది. దీంతో 10 గ్రాముల ధర రూ.50,500కి పతనమైంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,300 వద్ద మార్కెట్ అవుతోంది. Also Read : ​Benifits Of EPF Account: మీకు ఈపీఎఫ్ అకౌంట్ ఉందా.. ఈ బెనిఫిట్స్ తెలుసా!

3 /4

దేశ రాజధాని ఢిల్లీలో వరుసగా నాలుగో రోజు బంగారం ధర పతనమైంది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,310 మేర భారీగా తగ్గింది. దీంతో 10 గ్రాముల ధర రూ.52,850 అయింది. అదే సమయంలో 22 క్యారెట్లపై రూ.1,200 తగ్గడంతో బంగారం ధర 10 గ్రాములకు రూ.48,450 క్షీణించింది.

4 /4

దేశ రాజధాని ఢిల్లీలో వెండి ధర ఏకంగా రూ.6,000 మేర భారీగా తగ్గింది. నేడు 1 కేజీ వెండి ధర రూ.63,900 అయింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.5,500 మేర భారీగా తగ్గింది. ఏపీ, తెలంగాణ మార్కెట్లలో 1 కేజీ వెండి ధర రూ.69,000కు పతనమైంది.    Also Read: EPFO: పీఎఫ్ నగదు విత్‌డ్రా చేస్తున్నారా.. ఈ తప్పులు అసలు చేయవద్దు!