PM Modi launches nation-wide COVID-19 vaccination drive | న్యూఢిల్లీ: దేశ‌వ్యాప్తంగా కోవిడ్ -19 వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభమైంది. ఈ వ్యాక్సినేష‌న్‌ (Corona vaccination) కార్యక్రమాన్ని ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీ వ‌ర్చువ‌ల్ ద్వారా ప్రారంభించారు. క‌రోనావైరస్‌ను అరికట్టేందుకు వ్యాక్సిన్ ఎప్పుడు వ‌స్తుందోనన్న ఆందోళన ఉండేదని, కానీ మనకు తొందరగా క‌రోనా టీకా వ‌చ్చేసింద‌ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్ర‌పంచం అంతా కరోనాతో నానా ఇబ్బందులు పడుతోందని గుర్తుచేశారు. ప‌గ‌లు, రాత్రి అని తేడాలేకుండా శాస్త్ర‌వేత్త‌లు టీకా కోసం శ్ర‌మించార‌ని తెలిపారు. చాలా త‌క్కువ స‌మ‌యంలో టీకా వ‌చ్చేసింద‌ని.. అదికూడా మేడ్ ఇన్ ఇండియా టీకాలు రెండు మార్కెట్లోకి వ‌చ్చాయ‌ని తెలిపారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎవ‌రికైతే అత్య‌వ‌స‌ర‌మో.. వారికే ముందుగా టీకా ఇస్తున్నామని ప్రధానమంత్రి పేర్కొన్నారు. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవడం త‌ప్ప‌నిస‌రి అని మోదీ అన్నారు. అన్ని రాష్ట్రాలు కూడా టీకా పంపిణీకి సన్న‌ద్దమయ్యాయని.. తొలి ద‌ఫాలో మూడు కోట్ల మంది ఫ్రంట్‌లైన్ వ‌ర్క‌ర్ల‌కు టీకా ఇస్తున్న‌ట్లు మోదీ (Narendra Modi) తెలిపారు. కోవిడ్ టీకా తీసుకున్న త‌ర్వాత కూడా (Coronavirus) జాగ్ర‌త్త‌ల‌ను పాటించాలని మోదీ సూచించారు. మాస్క్‌లు ధ‌రించ‌డం, సోష‌ల్ డిస్టెన్స్ పాటించ‌డం త‌ప్ప‌నిస‌రని గుర్తుచేశారు. Also Read: COVID-19 Vaccine: కోవిడ్-19 టీకా ఎవరెవరు తీసుకోకూడదు.. తెలుసా?



అయితే.. ప్రధానమంత్రి మోదీ తన ప్రసంగంలో తెలుగు మహోన్నత కవి, రచయిత గురజాడ వ్యాఖ్యలను వినిపించారు. దేశం అంటే మ‌ట్టి కాదు.. దేశమంటే.. మ‌నుషులోయ్ అన్న వ్యాఖ్య‌ల‌ను మోదీ గుర్తుచేశారు. ప్ర‌జ‌లు ఒక‌రికి ఒక‌రు ఉప‌యోగ‌ప‌డాల‌న్న ఉద్దేశాన్ని ఆయ‌న వినిపించారు.


Also Read: COVID-19 Vaccine తీసుకున్నవారిలో ఏ లక్షణాలు కనిపిస్తాయంటే..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook