తల్లి ఆశీర్వాదాలు తీసుకుని ఓటు వేసిన ప్రధాని మోదీ
తల్లి ఆశీర్వాదాలు తీసుకుని ఓటు వేసిన ప్రధాని మోదీ
అహ్మెదాబాద్: లోక్ సభ ఎన్నికలు 3వ విడత పోలింగ్‌లో భాగంగా నేడు అహ్మెదాబాద్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ అంతకన్నా ముందుగా తన తల్లి హీరాబెన్ మోదీ నివాసానికి వెళ్లారు. అక్కడ ఆమె పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం రనిప్ ప్రాంతంలోని నిశాన్ విద్యాలయలోని పోలింగ్ కేంద్రం వద్ద మోదీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన ప్రధాని మోదీ.. కుంభమేళాలో పవిత్ర స్నానం చేసిన తర్వాత ఎంత పవిత్రంగా ఉన్నట్టు భావిస్తారో, ఎవరైనా ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం కూడా అలాగే ఉంటారని అన్నారు. అదృష్టవశాత్తుగా తాను తన సొంత రాష్ట్రంలోనే తన ఓటు హక్కు వినియోగించుకునే భాగ్యం దక్కిందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు.
3వ విడత లోక్ సభ ఎన్నికలు పోలింగ్ లైవ్ అప్‌డేట్స్, హైలైట్స్
ప్రధాని మోదీ ఓటు వేసే సమయంలో బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా ఆయనతోపాటే ఉన్నారు. అహ్మెదాబాద్‌లోని నరన్‌పురలో ఉదయం 9 గంటలకు అమిత్ షా తన ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.