Bipin Rawat's mortal remains at Palam airport: తమిళనాడులో ఆర్మీ హెలీక్యాప్టర్ కూలిన ప్రమాదంలో అమరులైన డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ పార్థివదేహానికి ప్రధాని నరేంద్ర మోదీ అంతిమ నివాళి అర్పించారు. త్రివిధ దళాల అధిపతి జనరల్ బిపిన్ రావత్‌తో పాటు ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మరో 12 మంది పార్థివదేహాలను ఢిల్లీలోని పాలం ఎయిర్ బేస్‌కి తీసుకురాగా.. కొద్దిసేపటి క్రితమే ప్రధాని మోదీ (PM Modi) అక్కడికి చేరుకుని వారికి నివాళి ఘటించారు. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సైతం పాలం ఎయిర్ బేస్‌లోనే జనరల్ బిపిన్ రావత్‌, ఆయన భార్య మధులిక రావత్‌తో పాటు ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మరో 11 మంది పార్థివదేహాలకు నివాళి అర్పించారు. అనంతరం అమరుల కుటుంబాలకు సానుభూతి తెలిపి వారికి ధైర్యం చెప్పారు.



నేషనల్ సెక్యురిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ కూడా జనరల్ బిపిన్ రావత్ పార్థివ దేహానికి అంతిమ నివాళి అర్పించారు.

Also read : Group Captain Varun Singh : హెలికాప్టర్‌ ప్రమాదం నుంచి బయటపడ్డ ఆ ఒక్కడు..ధైర్య సాహాసాలకు కేరాఫ్ అడ్రస్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook