PM Narendra Modi: న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనావైరస్ ( Coronavirus ) కేసులు రోజురోజుకీ విపరీతంగా పెరుగుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 49 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి కారణంగా మరణాల సంఖ్య కూడా నిత్యం పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ( PM Narendra Modi ) అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మరోసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. అయితే ఈ సమావేశం ఈ నెల 27న సోమవారం జరుగుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం దేశంలో పెరుగుతున్న కరోనా కేసులపై అదేవిధంగా అన్‌లాక్ 3.0 పరిస్థితులపై కూడా ప్రధానమంత్రి సీఎంలతో చర్చించనున్నారు. Also read: Apple: భారత్‌లో ఐఫోన్‌ 11 ఉత్పత్తి ప్రారంభం


అయితే ప్రధాని మోదీ మార్చి నెలలో మొట్లమొదటిసారి సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కరోనా లాక్‌డౌన్‌పై చర్చించారు. తాజాగా జూన్ 16,17 తేదీల్లో వరుసగా అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని కరోనాపై చర్చించారు. కరోనా తీవ్రత, ఆయా రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలు గురించి అదేవిధంగా లాక్‌డౌన్ సడలించిన తర్వాత పరిస్థితుల గురించి మోదీ తెలుసుకున్నారు. ఇదిలాఉంటే.. దేశంలో త్వరలో రోజుకు దాదాపు లక్ష కేసులు నమోదయ్యే అవకాశాలున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో సోమవారం జరగబోయే వీడియో కాన్ఫెరెన్స్‌కు ప్రాధాన్యం ఏర్పడింది. Also read: Selfie: సెల్ఫీ కోసం నదిలోకి దిగిన యువతులు