'కరోనా వైరస్'.. భారత దేశంలో వేగంగా విస్తరిస్తోంది. మూడు రోజుల క్రితం కేవలం 24 గంటల్లో దేశవ్యాప్తంగా వెయ్యి పాజిటివ్ కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించినప్పటికీ .. పెరుగుతున్న కేసుల సంఖ్య ఆందోళనకు కారణమవుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోవైపు దేశవ్యాప్తంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై కేంద్ర ప్రభుత్వం.. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమాలోచన చేయనుంది. ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీ .. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ఆయన ఏం చెప్పనున్నారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 


ఇప్పటికే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ తేదీని ఏప్రిల్ 30 వరకు పొడగించాయి. మొట్ట మొదట లాక్ డౌన్ పొడగింపుపై ఒడిశా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ పొడగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వానికి లేఖ ద్వారా తెలిపింది. మరోవైపు పంజాబ్ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసికి మే 1 వరకు లాక్ డౌన్ పొడగిస్తున్నట్లు పేర్కొంది. అటు తెలంగాణ ప్రభుత్వం కూడా లాక్ డౌన్ పొడగింపునకే మొగ్గు చూపుతోంది. ఇప్పటికే సీఎం కేసీఆర్ ఆ దిశగా సూచనలు కూడా ఇచ్చారు. నిన్నటినిన్న మంత్రి కేటీఆర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలు కూడా లాక్ డౌన్ పొడగిస్తేనే మంచిదనే భావనలో ఉన్నాయి.


ముందుగా ఆ 13 దేశాలకు హైడ్రాక్సీక్లోరోక్విన్


లాక్ డౌన్ పొడగింపు వల్ల కరోనా మహమ్మారిని ధీటుగా ఎదుర్కునే అవకాశం ఉంటుందనేది అందరి అభిప్రాయంగా ఉంది. ఐతే దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చర్చనీయాంశంగా మారింది. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మాట్లాడిన తర్వాత దీనిపై  క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..