/telugu/photo-gallery/tspsc-group-4-final-result-2024-category-wise-selected-candidates-list-check-full-details-here-rn-180895 TSPSC: తెలంగాణ గ్రూప్‌ 4 పరీక్షలో కేటగిరీలవారీగా పాసైన అభ్యర్థులు.. ఆరోజే నియామక పత్రాలు జారీ.. TSPSC: తెలంగాణ గ్రూప్‌ 4 పరీక్షలో కేటగిరీలవారీగా పాసైన అభ్యర్థులు.. ఆరోజే నియామక పత్రాలు జారీ.. 180895

'కరోనా వైరస్'.. వేగంగా విస్తరిస్తున్న క్రమంలో భారత దేశం అన్ని దేశాలకు ఆశాజ్యోతిగా  మారింది. ఎందుకంటే కరోనా వైరస్   పాజిటివ్ రోగుల చికిత్సలో భారత ఔషధం కీలక  పాత్ర  పోషిస్తోంది. అదే హైడ్రాక్సీక్లోరోక్విన్. దీన్ని ఎగుమతి చేయాలంటూ ప్రపంచంలోని దాదాపు 30 దేశాలు భారత దేశాన్ని కోరాయి. 

దీనిపై స్పందించిన భారత ప్రభుత్వం .. 'కరోనా వైరస్'.. మృత్యుక్రీడ ఆడుతున్న ఈ సమయంలో మానవత్వాన్ని చాటుకుంది. దేశీయ అవసరాలకు సరిపోయినంత ఔషధాన్ని ఉంచుకుని..  మిగతా వాటిని అన్ని దేశాలకు సరఫరా చేయాలని నిర్ణయించింది. ఈ  క్రమంలో   హైడ్రాక్సీక్లోరోక్విన్ ఔషధాన్ని ఎగుమతి చేసేందుకు ప్రస్తుతం ఉన్న ఆంక్షలను పాక్షికంగా ఎత్తేసింది. అంతే కాదు  ముందుగా ఏఏ దేశాలకు సరఫరా చేయాలనే దేశాల జాబితాను రూపొందించింది.  

అందులో మొదటగా 13  దేశాలకు హైడ్రాక్సీక్లోరోక్విన్ ఔషధంతోపాటు పారాసిటమాల్ మందులను కూడా  పంపించనున్నారు. ఇందుకోసం కోటి 40 లక్షల హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రలను ఉత్పత్తి చేసింది. వీటిని  మొత్తంగా 25 దేశాలకు ఎగుమతి చేయనున్నారు.  అందులో తొలుత 13  దేశాలకు సరఫరా చేస్తారు. అమెరికా, స్పెయిన్, జర్మనీ, డోమినికన్ రిపబ్లిక్, బ్రెజిల్, బహ్రెయిన్  తోపాటు పొరుగు దేశాలైన నేపాల్, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్, మాల్దీవులు, బంగ్లాదేశ్ దేశాలకు సరఫరా చేయనున్నారు.

ఏపీలో 133 రెడ్ జోన్లు.. కరోనాపై లేటెస్ట్ అప్‌డేట్స్

దేశీయ అవసరాలకు కోటి వరకు హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రలు అవసరం. ప్రస్తుతం 3 కోట్ల 28  లక్షల ట్యాబ్లెట్లు ఉన్నాయి. ఇప్పటికీ కోటి నుంచి 2 కోట్ల వరకు ఉత్పత్తి చేసే సామర్థ్యం భారతీయ కంపెనీలకు ఉంది. మరోవైపు హైడ్రాక్సీక్లోరోక్విన్ ట్యాబ్లెట్లు సరఫరా చేసేందుకు అంగీకరించనుందుకు ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, జపాన్ ప్రధాని షింజో అబే, బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ ఎమ్ బోల్సోనారో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కృతజ్ఞతలు తెలిపారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Section: 
English Title: 
Indian government prepares first list of countries to get hydroxychloroquine supply
News Source: 
Home Title: 

ముందుగా ఆ 13 దేశాలకు హైడ్రాక్సీక్లోరోక్విన్

ముందుగా ఆ 13 దేశాలకు హైడ్రాక్సీక్లోరోక్విన్
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
ముందుగా ఆ 13 దేశాలకు హైడ్రాక్సీక్లోరోక్విన్
Publish Later: 
No
Publish At: 
Saturday, April 11, 2020 - 09:36