Arresting Rules in India: ప్రజాస్వామ్యంలో శాంతి భద్రతల పరిరక్షణ పోలీసుల బాధ్యత. రాజ్యాంగంలోని చట్టాలు, నిబంధనలకు లోబడే పోలీసులు విధులు నిర్వర్తిస్తారు. కొన్ని సందర్భాల్లో కొంతమంది పోలీసులు అత్యుత్సాహంతో ఏకపక్ష చర్యలకు దిగి వివాదాలకు తెరలేపడం చూస్తుంటాం. ఇలాంటి పరిస్థితుల్లో బాధితులు చట్టం పట్ల అవగాహన కలిగి ఉన్నట్లయితే పోలీసులను నిలదీయగలరు. తమ పట్ల ఏకపక్ష చర్యలను అడ్డుకోగలరు. పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు వారు పాటించాల్సిన నిబంధనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అరెస్ట్ సమయంలో పోలీసులు పాటించాల్సిన రూల్స్.. నిందితులకు ఉండే హక్కులు :


పోలీసులు తమ ఇష్ఠానుసారం ఎవరినీ అరెస్ట్ చేయడం కుదరదు. ఏ కేసులోనైనా నిందితుల అరెస్టుకు చట్టపరమైన ప్రక్రియను అనుసరించాల్సిందే. అక్రమ అరెస్టు సీఆర్పీసీ ఉల్లంఘన మాత్రమే కాదు, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 20,21,22లకు విరుద్ధం.


పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసేందుకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా యూనిఫాం ధరించి ఉండాలి. యూనిఫాంకి ఉన్న నేమ్ ప్లాట్‌పై అతని పేరు స్పష్టంగా రాసి ఉండాలి.


సీఆర్పీసీ సెక్షన్ 57 ప్రకారం పోలీసులు ఏ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నా 24 గంటలకు మించి కస్టడీలో ఉంచుకోకూడదు. సీఆర్పీసీ సెక్షన్ 56 ప్రకారం మేజిస్ట్రేట్ అనుమతి ఉంటేనే 24 గంటల తర్వాత కస్టడీలో ఉంచుకునే అవకాశం ఉంటుంది.


సీఆర్పీసీ సెక్షన్ 50(1) ప్రకారం అరెస్ట్ సమయంలో పోలీసులు తప్పనిసరిగా కారణాన్ని తెలియజేయాలి.


సీఆర్పీసీ సెక్షన్-41B ప్రకారం అరెస్టుకు ముందు అరెస్ట్ మెమోను జారీ చేయాలి. అందులో అరెస్టు చేసే పోలీసు అధికారి ర్యాంక్, అరెస్టు సమయం, ప్రత్యక్ష సాక్షి సంతకం తప్పనసరిగా ఉండాలి. అరెస్టు చేసిన వ్యక్తి ఐడెంటిఫికేషన్ కూడా అందులో ఉండాలి.


సీఆర్పీసీ సెక్షన్ 50ఏ ప్రకారం అరెస్టయిన వ్యక్తి కుటుంబ సభ్యులు లేదా బంధువులకు పోలీసులు సమాచారం ఇవ్వాలి. 


సీఆర్పీసీ సెక్షన్ 41డీ ప్రకారం అరెస్ట్ అయిన వ్యక్తికి పోలీస్ విచారణ సమయంలో ఎప్పుడైనా తన న్యాయవాదిని కలిసే హక్కు ఉంటుంది. అంతేకాదు,తన కుటుంబంతో కూడా మాట్లాడవచ్చు.


సీఆర్పీసీ సెక్షన్ 54 ప్రకారం అరెస్ట్ అయిన వ్యక్తి వైద్య పరీక్షలు చేయించుకోవచ్చు. అతను కోరితే వైద్యులు తప్పక వైద్య సహాయం అందించాలి.


అరెస్టయిన ప్రతీ వ్యక్తి 48 గంటలకు ఒకసారి వైద్య పరీక్షలు చేయించుకునే వెసులుబాటును చట్టం కల్పిస్తోంది.


Also Read: Also Read: Bimbisara Twitter Review: కల్యాణ్ రామ్ 'బింబిసార' ట్విట్టర్ రివ్యూ.. సినిమా ప్రేక్షకులను మెప్పించిందా.. 


Also Read: Sita Ramam Twitter Review: ప్రేక్షకుల ముందుకు 'సీతారామం'.. టాక్‌ ఎలా ఉందంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook