Bimbisara Twitter Review: కల్యాణ్ రామ్ 'బింబిసార' ట్విట్టర్ రివ్యూ.. సినిమా ప్రేక్షకులను మెప్పించిందా..

Bimbisara Twitter Review: 'బింబిసార' ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. కల్యాణ్ రామ్ తొలిసారి హిస్టారికల్ రోల్‌లో కనిపించబోతున్న సినిమా ఇది.

Written by - Srinivas Mittapalli | Last Updated : Aug 5, 2022, 12:10 PM IST
  • ప్రేక్షకుల ముందుకొచ్చిన కల్యాణ్ రామ్ బింబిసార
  • తొలిసారి చారిత్రక నేపథ్యంతో కూడిన కథలో కల్యాణ్ రామ్
  • సినిమా ప్రేక్షకులను మెప్పించిందా... ట్విట్టర్ టాక్ ఎలా ఉంది..
Bimbisara Twitter Review: కల్యాణ్ రామ్ 'బింబిసార' ట్విట్టర్ రివ్యూ.. సినిమా ప్రేక్షకులను మెప్పించిందా..

Kalyan Ram Bimbisara Twitter Review: నందమూరి కల్యాణ్ రామ్ కెరీర్‌లో రిలీజ్‌కు ముందు భారీ బజ్ ఏర్పడిన సినిమా బింబిసార. ఇదివరకు కల్యాణ్ రామ్ చేసిన ఏ సినిమాకు ఈ స్థాయిలో బజ్ రాలేదు. కొత్త దర్శకుడు శ్రీవశిష్ఠ్ దర్శకత్వంలో కల్యాణ్ రామ్ హీరోగా, కేథరిన్ థ్రెసా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా ఈ సినిమా తెరకెక్కింది. దాదాపు రూ.40 కోట్ల బడ్జెట్‌తో చారిత్రక నేపథ్యాన్ని ఇతివృత్తంగా తీసుకుని ఈ సినిమాను తెరకెక్కించారు. క్రీ.పూ. 5వ శతాబ్దానికి చెందిన మగధ సామ్రాజ్యాధిపతి, గౌతమ బుద్ధుడి సమకాలీడైన బింబిసార జీవిత కథ, టైమ్ ట్రావెలింగ్ పాయింట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాకు ట్విట్టర్ టాక్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం...

బింబిసార ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో జూ.ఎన్టీఆర్ చెప్పినట్లు ఈ సినిమా ఫ్యాన్స్ కాలర్ ఎగిరేసేలా ఉంటుందని ఓ ఫ్యాన్ ట్విట్టర్‌ వీడియో ద్వారా తన రివ్యూ ఇచ్చాడు. సినిమా బ్లాక్ బ్లస్టర్ అని కామెంట్ చేశాడు.

కల్యాణ్ రామ్ కెరీర్‌లోనే బింబిసార బిగ్గెస్ట్ హిట్ అంటూ మూవీ ముచ్చట్లు అనే ట్విట్టర్‌ అకౌంట్‌లో రివ్యూ పోస్ట్ చేశారు.ఫస్టాఫ్, సెకండాఫ్ రెండూ అద్భుతంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఆసక్తికరంగా సాగే టైమ్ ట్రావెలింగ్ కంటెంట్ మిమ్మల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుందని చెప్పుకొచ్చారు.

ది మూవీ క్రిటిక్ అనే ట్విట్టర్ ఖాతాలో ఇన్‌సైడ్ ఇన్ఫో ప్రకారం బింబిసార యావరేజ్‌గా ఉందని రివ్యూ ఇచ్చారు.

బింబిసార ఫస్టాఫ్ అదిరిపోయింది.. కల్యాణ్ రామ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ మూవీ.. వాటే స్టోరీ.. అంటూ మరో నెటిజన్ సినిమాపై తన రివ్యూ షేర్ చేశాడు. 

అతనొక్కడే, పటాస్ తర్వాత కల్యాణ్ రామ్ కెరీర్‌లో పెద్ద బ్రేక్ రాలేదు. ఈసారి డిఫరెంట్‌గా బింబిసార అనే హిస్టారికల్ రోల్‌తో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు కల్యాణ్ రామ్. సినిమా హిట్‌పై ఆయన చాలా ధీమాగా ఉన్నారు. మరి ఈ సినిమాతోనైనా కల్యాణ్ రామ్‌కు బిగ్ హిట్ సొంతమవుతుందా.. లేదా చూడాలి.

Also Read: Horoscope Today August 5th : నేటి రాశి ఫలాలు.. రిలేషన్‌షిప్‌లో ఉన్న ఈ రాశి వారు మోసపోయే ప్రమాదం..

Also Read: Comedian Raghu's father death: జబర్ధస్త్ కమెడియన్ రఘు తండ్రి మృతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x