Alappuzha Political murders: కేరళలోని అలప్పుజ జిల్లాలో రాజకీయ నాయకుల హత్యలు కలకలం (Political Murders in Kerala) రేపుతున్నాయి. రెండు వేర్వేరు పార్టీలకు చెందిన ఇద్దరు నాయకులు గంటల వ్యవధిలో హత్యకు గురయ్యారు. ఈ ఘటనతో జిల్లాలో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా కేరళ పోలీసులు చర్యల చేపట్టారు. జిల్లాలో 144 సెక్షన్​ (Section 144 in Alappuzha) విధించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అసలు ఏం జరిగిందంటే..


బీజేపీ నేత, బీబీసీ మోర్చ విభాగ రాష్ట్ర కార్యదర్శి రంజిత్ శ్రీనివాస్ (BJP leader Murder) ఇవాళ ఉదయం (డిసెంబర్ 19 ఆదివారం) హత్యకు గురయ్యారు. ఆయన్ను తన ఇంట్లోనే హత్య చేసి పరారయ్యారు. హత్య జరిగిన సమయంలో రంజిత్​ శ్రీనివాస్ భార్య(Ranjith Srinivas Murder), తల్లి ఇంట్లోనే ఉన్నారు.


రంజిత్​ శ్రీనివాస్​ అడ్వొకేట్​గా కూడా ప్రాక్టిస్​ చేస్తున్నారు. మరోవైపు అలప్పుజ నుంచి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా ఉన్నారు.


అంతకు ముందు ఎస్​డీపీఐ నేత హత్య..


రంజిత్ శ్రీనివాస్​ కన్నా కొన్ని గంటల ముందు.. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎస్​డీపీఐ) రాష్ట్ర కార్యదర్శి కేఎస్ షాన్ (SDPI leader Murder).. శనివారం రాత్రి హత్యకు గురయ్యారు. పార్టీ కార్యాలయం నుంచి బైక్​పై ఇంటికి వెళ్తున్న ఆయన్ను కొంత మంది గుర్తు తెలియని దుండగులు కారుతో ఢీ కొట్టి.. అడ్డగించారు. ఆ తర్వాత ఆయనపై దాడికి దిగారు.


కొన ఊపిరితో ఉన్న షాన్​ను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు.


తమ పార్టీ నేత హత్యను ఎస్​డీపీఐ రాష్ట అధ్యక్షుడు మువత్తుపుజ అష్రఫ్ మౌలవి ఖండించారు. ఈ హత్య వెనక బీజేపీ, ఆర్​ఎస్​ఎస్​లు ఉన్నాయని ఆరోపించారు. తమ నేతలపై దాడులను ఆపకుంటే.. తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కోక తప్పదని బీజేపీ, ఆర్​ఎస్​ఎస్​లను హెచ్చరించారు.


ఎస్​డీపీఐ నేత హత్య తరువాత.. గంటల వ్యవధిలోనే బీజేపీ నేత హత్యకు గురవడం ఇప్పుడు సంచలంగా మారింది. ఈ హత్యలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


ఖండిచిన నేతలు..


ఈ దాడులను ఖండిస్తున్నట్లు కేరళ సీఎం పినరయ్ విజయన్ (Kerala CM) తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయించనున్నట్లు వెల్లడించారు. కేరళ కాంగ్రెస్ ఖండించింది. ఇరు పక్షాలు ఇలాంటి చర్యలను మానుకోవాలని సూచించింది.


Also read: Covid Super Strain: ఇండియాలో కరోనా థర్డ్‌వేవ్ ముప్పు, సూపర్ స్ట్రెయిన్‌పై పెరుగుతున్న ఆందోళన


Also read: Corona cases in India: దేశంలో తగ్గుతున్న కొవిడ్ తీవ్రత- 2020 మార్చి స్థాయికి యాక్టివ్​ కేసులు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook