Post Office Investment Scheme: నెలకు కేవలం 15 వందల రూపాయలు ఖర్చుపెట్టి...35 లక్షల వరకూ సంపాదించవచ్చు. ఆశ్చర్యంగా ఉందా..కానీ నిజమే. ఎలాగో తెలుసుకుందాం. 15 వందల పెట్టుబడి లక్షలు ఎలా కురిపిస్తుందో చూద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కష్టపడి సంపాదించి డబ్బును ఎక్కడైనా పెట్టుబడి పెడితే బాగుంటుందనేది ప్రతి మధ్య తరగతి వ్యక్తి  ఆలోచన. సరైన మార్గంలో మీరు పెట్టే పెట్టుబడి మీ భవిష్యత్‌ను సంరక్షిస్తుంది. మార్కెట్‌లో చాలా రకాల పెట్టుబడి మార్గాలు, ప్రణాళికలు అందుబాటులో ున్నాయి. కానీ ప్రతి ఒక్క పెట్టుబడిలో రిస్క్ తప్పనిసరిగా ఉంటుంది. అయితే ఏ మాత్రం రిస్క్ లేకుండా మీ పెట్టుబడికి కచ్చితమైన లాభాల్ని తెచ్చిపెట్టే ఇన్వెస్ట్‌మెంట్ కూడా ఉంది. అదే పోస్టాఫీసు ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్ (Post Office Investment Schemes). పెట్టుబడి ప్రణాళికలు చేసేవారికి ఇదొక అద్భుత అవకాశం. మంచి మార్గం. ఇందులో కేవలం 15 వందల రూపాయల పెట్టుబడితో 35 లక్షల వరకూ సంపాదించవచ్చు (Earn 35 lakhs with just 15 hundred per month). 


ఈ స్కీమ్ పేరు గ్రామ్ సురక్షా పథకం (Gram Suraksha Scheme). మీరు 19 ఏళ్లలోపువారైతే ఇది మీకు మంచి పథకం కానుంది. అదే సమయంలో 19 నుంచి 55 ఏళ్ల వరకూ ఈ స్కీమ్‌లో చేరవచ్చు. వాస్తవానికి పోస్టాఫీసులో చాలా రకాల ఇన్వెస్ట్‌మెంట్ అవకాశాలున్నాయి కానీ ఇది మాత్రం మంచి పథకమంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. 19 ఏల్ల వయస్సువారికి చాలా ఉపయోగమంటున్నారు. 


19 వయస్సులో మీరు ఇన్వెస్ట్‌మెంట్ (Investment) ప్రారంభిస్తే..మీ నెలసరి వాయిదా కేవలం 1515 రూపాయలు మాత్రమే. అది 55 ఏళ్ల వరకూ కట్టాల్సి ఉంటుంది. 58 ఏళ్ల వరకైతే 1463 రూపాయలు, 60 ఏళ్ల వరకైతే 1411 రూపాయలు కట్టాలి. గ్రామ సురక్ష పథకం ప్రకారం 55 ఏళ్ల తరువాత పెట్టుబడి పెట్టిన వ్యక్తి లేదా పాలసీదారుడికి మెచ్యూరిటీ కింద 31.60 లక్షల రూపాయలు చేతికి అందుతాయి. అదే వ్యక్తి 58 ఏళ్ల పాటు పెట్టుబడి పెడితే.. అనంతరం 33.40 లక్షల రూపాయలు అందుతాయి. 60 ఏళ్ల పాటు కొనసాగితే మెచ్యూరిటీ బెనిఫిట్ 34.60 లక్షలు అందుతాయి. ఈ స్కీమ్‌లో కనీస లాభం పదివేల నుంచి పది లక్షల వరకూ ఉంటుంది. ఒకవేళ పెట్టుబడిదారుడు మరణిస్తే..మెచ్యూరిటీ మొత్తం నామినా లేదా లీగల్ హెయిర్‌కు అందుతుంది. 


ఈ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ప్రకారం ప్రీమియం నెలకు, మూడు నెలలకు, ఆరు నెలలకు లేదా ఏడాదికోసారి చెల్లించవచ్చు. ఒకవేళ ఏదైనా అత్యవసరమైతే నెలరోజుల గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఒకవేళ మూడేళ్ల తరువాత వినియోగదారుడు లేదా పెట్టుబడిదారుడు ఇన్సూరెన్స్ నిలిపివేయాలనుకుంటే ఆ అవకాశముంటుంది. అయితే అలా చేస్తే ఏ విధమైన బెనిఫిట్స్ చేతికి అందవు. అత్యవసమైతే తప్ప అలా చేయవద్దనే పోస్టల్ డిపార్ట్‌మెంట్ సూచిస్తోంది. వ్యక్తిగత సమాచారం, ఈ మెయిల్, చిరునామా, ఫోన్ నెంబర్, నామినీ వంటివి మార్చే సౌలభ్యముంటుంది. 


Also read: India Omicron Update: దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్ సంక్రమణ, కొత్తగా ఎన్ని కేసులంటే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి