Kunal Shah's Net Worth: మెటా, కునాల్ షాను వాట్సాప్ కొత్త గ్లోబల్ హెడ్‌గా నియమించి. క్రెడ్లో 900 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టింది. విల్ క్యాత్‌కార్ట్ పదవి నుంచి వైదొలగగా, మిటెన్ సంపత్ క్రెడ్ బాధ్యతలు స్వీకరించారు.
Sukanya Samriddhi Yojana Calculator: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలతోపాటు ఆడపిల్లల భవిష్యత్తు కోసం కూడా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆడపిల్ల పుట్టిందని తెలియగానే భారంగా భావించేవారు ఎంతో మంది ఉన్నారు. వారి చదువులు, పెళ్లిళ్ల కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్న తల్లిదండ్రులు ఉన్నారు. అందుకే మోదీ ప్రభుత్వం ఆడకూతుర్ల ఉజ్వల భవిష్యత్తు కోసం ఎన్నో రకాల పొదుపు పథకాలను తీసుకువచ్చింది.
Pension Rules 2026: ప్రభుత్వ ఉద్యోగం అంటే ఒక హోదా మాత్రమే కాదు.. రిటైర్మెంట్ తర్వాత లభించే జీవిత భరోసా. అయితే గతంలో ఉన్ పెన్షన్ విధానం స్థానంలో కేంద్రం ఇప్పుడు జాతీయ పెన్షన్ వ్యవస్థను కు సంబంధించిన సరికొత్త గైడ్ లైన్స్ ను 2026 నోటిఫికేషన్ ద్వారా అమల్లోకి తీసుకువచ్చింది జనవరి 1,2024 తర్వాత ఉద్యోగం జాయిన్ అయిన వారందరికీ ఈ రూల్స్ వర్తిస్తాయి.
Rent vs Buy: సొంత ఇల్లు అనేది ప్రతి ఒకరి కల. కట్టుకోవడమా? లేదా కొనుగోలు చేయడమా? ఏవిధంగా అయినా జీవితంలో సొంత ఇల్లు ఉండాలి అనుకుంటారు. కానీ పెరుగుతున్న జీవన వ్యయంతో చాలా మంది ఆ కలను నెవర్చుకోలేకపోతున్నారు. అందుకే పట్టణాల్లో, నగరాల్లో కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో కూడా సొంత ఇల్లు లేక అద్దె ఉంటున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. గత కొన్ని నెలలుగా నగరాల్లో ఆస్తుల ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇల్లు కొనడం మంచిది లేదా అద్దెకు ఉండటం మంచిదా. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Silver Rate Today: బంగారం చూపిన బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. గత కొంతకాలంగా సామాన్యులు అందుకోలేనంత ఎత్తుకు చేరిన వెండి ధరలు ఇప్పుడు క్రమంగా నెలచూపులు చూస్తున్నాయి. ఏప్రిల్ 16వ తేదీ గురువారం నాటి ధరలను చూసినట్లయితే.. వెండి ధర రికార్డు స్థాయి నుంచి భారీగా పతనమైంది.
Gold Price Drop Alert: పసిడి ప్రియులకు ఇది నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. బంగారం ధరలు పెరుగుతున్నప్పటికీ.. ఇంకా ఆల్ టైం రికార్డు స్థాయి నుంచి దిగువకే ఉన్నాయి. గత కొన్ని నెలలుగా చుక్కలు చూపించిన పసిడి ధరలు ఇప్పుడు ఒక్కసారిగా రివర్స్ గేర్ వేశాయి. జనవరి 2026 నెలలో ఆల్ టైం రికార్డులను క్రియేట్ చేసినప్పటికీ.. ఇప్పుడు ధరలు భారీగా దిగివచ్చాయి. ఏప్రిల్ 16వ తేదీ గురువారం ధరలు చూసినట్లయితే.. బంగారం ధరలు మళ్లీ సామాన్యులకు అందుబాటులోకి వస్తున్నాయన్నది స్పష్టం అవుతోంది.
Gold Silver Price Crash: గత కొంతకాలంగా ఆకాశాన్ని తాకుతున్న బంగారం ధరలు ఒక్కసారిగా నేలచూపులు చూస్తున్నాయి. జనవరిలో సరికొత్త రికార్డులను సృష్టించిన బంగారం ధరలు ఇప్పుడు భారీగా దిగివస్తున్నాయి. కేవలం మూడు నెలల వ్యవధిలోనే తులం బంగారంపై ఏకంగా రూ. 41,000 మేర ధర తగ్గడం మార్కెట్ వర్గాలను విస్మయానికి గురి చేస్తోంది.
Indian Households Gold: భారతీయ మహిళలకు బంగారానికి మధ్య ఉన్న సంబంధం గురించి ప్రత్యేకించీ చెప్పాల్సిన అవసరం లేదు. బంగారాన్ని భారతీయులు ఒక ఆభరణంగా మాత్రమే కాదు.. దానిని ఒక సెంటిమెంట్ గా భావిస్తుంటారు. ఆపద వచ్చినా..ఆర్థిక కష్టం వచ్చినా..మరే ఇతర సమస్య వచ్చినా..ముందుగా వారికి బంగారమే గుర్తుకు వస్తుంది. ఎందుకంటే ఇంట్లో ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి లేదా అమ్మి తమ అత్యవసర పరిస్థితులను గట్టెక్కే ప్రయత్నం చేస్తుంటారు. అందుకే చాలా మంది మహిళలు.. చేతిలో ఏమాత్రం డబ్బు ఉన్నా సరే బంగారం కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.
Gold Prediction: బంగారం అంటే కేవలం ఆభరణం మాత్రమే కాదు.. భారతీయులకు అది ఒక సురక్షితమైన పెట్టుబడి. అయితే.. గత కొంతకాలంగా రికార్డు స్థాయిలకు చేరుకున్న పసిడి ధరలు, ఇప్పుడు ఒక్కసారిగా కుప్పకూలే ప్రమాదం ఉందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికన్ ట్రేడింగ్ అనలిసిస్ ప్లాట్‌ఫామ్ ఎలియట్ వేవ్ వ్యవస్థాపకుడు, ప్రముఖ విశ్లేషకుడు గిల్బర్ట్ చేసిన తాజా అంచనాలు ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో హాట్ టాపిక్‌గా మారాయి.
silver price crash: బులియన్ మార్కెట్లో వెండి ధరలు ఒక్కసారిగా నేలచూపులు చూస్తున్నాయి. గురువారం ఉదయం ఇరాన్ యుద్ధంపై డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన సమాచారం వెండి ఇన్వెస్టర్లకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. అమెరికా సాధించాలనుకున్న లక్ష్యాలు దాదాపు నెరవేరాయని.. రాబోయే రెండు మూడు వారాల్లో కీలక చర్యలు తీసుకోబోతున్నామని ట్రంప్ ప్రకటించడంతో మార్కెట్లో అనిశ్చితి రాజ్యమేలింది. ఈ ప్రభావంతో మల్టీ-కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో వెండి ధరలు గతంలో ఎన్నడూ లేని విధంగా కుప్పకూలాయి.
Gold Market Crash: గడిచిన 17 ఏళ్లలో ఈ మార్చి నెల పసిడికి అత్యంత గడ్డు కాలంగా మారింది. ఒకే నెలలో ధర 13శాతం పడిపోవడం 2008 తర్వాత ఇదే తొలిసారి. యుద్ధ ఉద్రిక్తతలు తగ్గుతాయన్న ఆశలతో నేడు ధరలు స్వల్పంగా పుంజుకున్నప్పటికీ.. డాలర్ బలోపేతం, వడ్డీ రేట్ల అనిశ్చితి వల్ల బంగారం భారీ ఒత్తిడిని ఎదుర్కొంటోంది.
Gold Selling: ఇటీవలి కాలంలో బంగారం ధరలు వరుసగా భారీగా పడిపోవడం ఇన్వెస్టర్లను విస్మయానికి గురిచేస్తోంది. కేవలం డాలర్ బలపడటం వల్లే ధరలు తగ్గుతున్నాయని అందరూ భావిస్తున్నారు. కానీ తెర వెనుక అసలు కథ వేరే ఉంది. ఏప్రిల్ 2026 సమీపిస్తున్న కొద్దీ.. గత కొన్నేళ్లుగా పసిడికి కొండంత అండగా నిలిచిన ప్రపంచ దేశాల కేంద్ర బ్యాంకులు.. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో తమ నిల్వలను మార్కెట్లో విక్రయిస్తున్నాయి.
Bank auto sweep facility: మనం కష్టపడి సంపాదించిన డబ్బును భద్రంగా ఉంటుందని బ్యాంకు సేవింగ్స్ ఖాతాలో వేస్తుంటాము. కానీ ద్రవ్యోల్బణం పెరుగుతున్న తరుణంలో.. సేవింగ్స్ ఖాతా ఇచ్చే అతి తక్కువ వడ్డీ మన ఆర్థిక వృద్ధికి సరిపోదు. అందుకే.. మీ డబ్బుపై మీరు గరిష్ట లాభం పొందాలంటే ఆటో స్వీప్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి. దీని కోసం మీరు కొత్తగా పెట్టుబడులు పెట్టక్కర్లేదు. కేవలం మీ బ్యాంకుకు వెళ్లి ఈ సర్వీస్‌ను ఎనేబుల్ చేయమని చెబితే సరిపోతుంది.
Gold Rate Today: అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు అనూహ్యంగా పడిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు భారీ స్థాయిలో ధరలు తగ్గడం పసిడి ప్రియులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత డాలర్ విలువ విపరీతంగా బలపడటం, బిట్‌కాయిన్ వంటి ప్రత్యామ్నాయ పెట్టుబడుల వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపడం వల్ల బంగారం డిమాండ్ తగ్గింది.
Foreign Investment Trend: ఫిబ్రవరిలో FIIలు భారత మార్కెట్లో $2.44 బిలియన్ల నికర పెట్టుబడి పెట్టారు. గత 17 నెలల్లో అత్యధిక ఇన్‌ఫ్లో అని చెప్పాలి. మార్కెట్ స్థిరంగా ఉన్నప్పటికీ ఐటీ ఇంకా ఒత్తిడిలోనే ఉంది. అయితే ఇది తాత్కాలిక పాజ్, పూర్తి ట్రెండ్ రివర్సల్ కాదు. రాబోయే నెలల్లో కొనుగోళ్లు పెరగవచ్చని సూచనలు ఉన్నట్లు మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
Gold: భారతీయులు బంగారాన్ని పెట్టుబడిగా చూసినట్లయితే.. వారిలో వచ్చే మొదటి ఆలోచన ఆభరణాలే అని చెప్పాలి. ఎందుకంటే బంగారం కొంటేనే భద్రతగా ఉంటుందన్న భావన ఎక్కువ మందిలో ఉంది. కానీ ఆభరణాల రూపంలో బంగారాన్ని కొనుగోలు చేస్తే అసలు బంగారం విలువకు అదనంగా తరుగు, మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీ వంటి ఖర్చులు భరించాల్సిందే. కొనుగోలు సమయంలో ఇన్ని అదనపు ఛార్జీల భారం పడటం పెట్టుబడి రాబడి అనేది తగ్గుతుంది.
No Risk And Get Double Profit Invest In Kisan Vikas Patra: ఆర్థికంగా భరోసా ఉండాలంటే భవిష్యత్ ప్రణాళికలు ఉండాలి. రిస్క్ లేకుండా.. స్థిరంగా ఆదాయం వచ్చే పోస్టాఫీస్ పథకం ఒకటి ఉంది. కిసాన్ వికాస్ పత్ర పేరిట ఉన్న పథకం అధిక లాభం అందిస్తుంది. ఆ పథకం వివరాలు ఇలా ఉన్నాయి.
Business Ideas: నేటి కాలం మహిళలు.. పురుషులతో పోటి పడి సంపాదిస్తున్నారు. ఇంటి బాధ్యతలు చూసుకుంటూ మగాళ్లతో సంపాదనలో పోటీ పడుతున్నవారిని ఎందరినో చూస్తున్నాం. అయితే కొంత మంది మహిళలకు ఇంట్లో పిల్లలను చూసుకునేవారు లేక ఉద్యోగం చేయాలని ఉన్నా.. తప్పనిసరి పరిస్థితుల్లో ఇంటికే పరిమితం అవుతున్నారు. మరికొంత మంది మహిళలు ఉద్యోగాలు చేస్తున్నా.. ఆఫీస్ వాతావరణం నచ్చక..మనస్సు చంపుకోని ఉద్యోగం చేయలేక మధ్యలోనే మానేస్తున్నవారెంతో మంది ఉన్నారు. అలాంటివారికోసం ఇప్పుడు మేము చెప్పే బిజినెస్ ఐడియాలు ఇంట్లో నుంచి కాలు బయటపెట్టకుండానే లక్షలు సంపాదించవచ్చు. అవేంటో చూద్దాం.
Gold Rate Today: పండుగ సీజన్లో బంగారం, వెండి కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి గుడ్ న్యూస్. ఇటీవల పెరుగుతూ వచ్చిన పసిడి, వెండి ధరలు ఇప్పుడు ఒక్కసారిగా భారీగా కుప్పకూలాయి. అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో లాభాల స్వీకరణ (ప్రాఫిట్ బుకింగ్) కారణంగా గోల్డ్ రేట్లు క్షీణించాయని నిపుణులు చెబుతున్నారు.
Vizag Google Data Center: వైజాగ్‌లో గూగుల్ 15 బిలియన్ డాలర్లతో భారీ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. దీంతో వేలాది ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. డేటా సెంటర్లలో టెక్నీషియన్, నెట్వర్క్ ఇంజనీర్, సెక్యూరిటీ అనలిస్ట్ వంటి అవకాశాలు ఉంటాయి. సంబంధిత ఐటీ, నెట్వర్కింగ్ కోర్సులు, సర్టిఫికేషన్లు ఉన్న వారికి విస్తృత అవకాశాలు లభించనున్నాయి.
Today Gold Rate: తెలుగు రాష్ట్రాల బులియన్ మార్కెట్లలో బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా తగ్గి, వినియోగదారులకు ఊరటనిచ్చాయి. ఇటీవల వరకూ పెరుగుతూ పెట్టుబడిదారుల ఊపిరి ఆడనివ్వని బంగారం ధరలు, శుక్రవారం మాత్రం గణనీయంగా పడిపోయాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ తాజా వివరాల ప్రకారం, 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,860 తగ్గి రూ.1,22,290కు చేరుకుంది. ఇదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.1,700 తగ్గి రూ.1,12,100గా నమోదైంది.
Indian Culture: భారతదేశంలో బంగారం కేవలం ఆభరణం మాత్రమే కాకుండా శుభప్రదం, సంప్రదాయం, పెట్టుబడి ప్రతీకగా భాస్తుంటారు. వివాహాలు, పండుగలు బంగారం లేకుండా పూర్తికావు. ప్రస్తుతం భారతీయ కుటుంబాల వద్ద దాదాపు 25,000 టన్నుల బంగారం ఉందని అంచనా. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ నిల్వ అని చెబుతున్నారు. చైనా తర్వాత భారత్ ప్రపంచంలో రెండవ అతిపెద్ద బంగారం వినియోగదారుగా ఉంది. ద్రవ్యోల్బణం, ఆర్థిక అనిశ్చితి మధ్య బంగారం భద్రమైన పెట్టుబడిగా నిలుస్తోంది.