India Omicron Update: దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్ సంక్రమణ, కొత్తగా ఎన్ని కేసులంటే

India Omicron Update: ఓ వైపు దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతుంటే..మరోవైపు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దేశంలో కలకలం సృష్టిస్తోంది. నెమ్మదిగా కేసుల సంఖ్య పెరుగుతోంది. దేశంలో కొత్తగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 27, 2021, 10:24 AM IST
  • దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్ వేరియంట్ కేసులు, దేశంలో మొత్తం కేసులు 578
  • ఢిల్లీలో అత్యధికంగా 142, మహారాష్ట్రలో అత్యధికంగా 141 ఒమిక్రాన్ కేసులు
  • తెలంగాణలో 41, ఏపీలో 6 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు
India Omicron Update: దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్ సంక్రమణ, కొత్తగా ఎన్ని కేసులంటే

India Omicron Update: ఓ వైపు దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతుంటే..మరోవైపు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దేశంలో కలకలం సృష్టిస్తోంది. నెమ్మదిగా కేసుల సంఖ్య పెరుగుతోంది. దేశంలో కొత్తగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య..

దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దేశంలో చాపకిందనీరులా విస్తరిస్తోంది. ఓ వైపు కరోనా కొత్త కేసులు తగ్గుముఖం పట్టినా ఒమిక్రాన్ (Omicron Variant) ముప్పు పెరుగుతోంది. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం దేశంలో 6 వేల 531 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇప్పటి వరకూ 3 కోట్ల 47 లక్షల 93 వేల 333 కరోనా కేసులు నమోదు కాగా.. యాక్టివ్ కేసుల సంఖ్య 75 వేల 841కు చేరుకుంది. అదే సమయంలో కరోనా కారణంగా దేశంలో ఇప్పటి వరకూ 4 లక్షల 79 వేల 997 మంది మరణించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశంలో కరోనా పాజిటివ్ రేటు ప్రస్తుతం 98.40 శాతంగా ఉంది. దేశంలో తాజాగా కరోనా కారణంగా 7 వేల 141 మంది మరణించారు. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 13 వేల 534 మంది కోవిడ్ నుంచి కోలుకోగా..దేశవ్యాప్తంగా 3 కోట్ల 36 లక్షల 41 వేల 175 మంది కోలుకున్నారు. దేశంలో ఇప్పటి వరకూ 141 కోట్ల 70 లక్ల 25 వేలమందికి కోవిడ్ వ్యాక్సినేషన్ ఇచ్చారు. ఇదిలా ఉండగా దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య మాత్రం రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. దేశంలో కొత్త ఒమిక్రాన్ కేసుల సంఖ్య 578కు చేరుకుంది. 

ఢిల్లీలో అత్యధికంగా (Delhi Omicron Cases) 142 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా, మహారాష్ట్రలో (Maharashtra Omicron Cases)141, కేరళలో 57, గుజరాత్‌లో 49, రాజస్థాన్‌లో 43, తెలంగాణలో 41 (Telangana Omicron Cases), తమిళనాడులో 34, కర్ణాటకలో 31, మధ్యప్రదేశ్‌లో 9, ఆంధ్రప్రదేశ్‌లో (Andhra pradesh Omicron Cases) 6 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ సంక్రమణ దృష్టిలో ఉంచుకుని చాలా రాష్ట్రాల్లో నైట్‌కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో కొత్త సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించారు. 

Also read: 16 Crucial Vitamins: అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టే 16 కీలకమైన విటమిన్లు ఏవో తెలుసా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News