పద్మావత్ సినిమా రిలీజ్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఒక పక్క పద్మావత్ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లపై దాడులు చేస్తూ రాజ్‌పూత్ కర్ణి సేన ఆందోళన బాటపడుతుంటే.. మరోవైపు దీనికి మద్దతుగా నిలుస్తూ నెటిజ‌న్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కులమత బేధాలను నిషేధిద్దాం అంటూ కామెంట్స్ పెడుతూ పద్మావత్‌కు మద్దతు ప్రకటిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పుటికే పద్మావత్ సినిమాకు బాలీవుడ్ ప్రముఖలు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు కూడా ఈ సినిమా ప్రదర్శనకు గ్రీస్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ సినిమా తమ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందంటూ  కర్ణిసేన గుజరాత్‌తో సహా పలు రాష్ట్రాల్లో ఆందోళన బాటపట్టింది. ఈ వర్గం వాదనకు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ కూడా మద్దతు తెలపడం విశేషం.