Prakash Raj: పవన్ కల్యాణ్‌కు షాకిచ్చిన ప్రకాశ్ రాజ్.. డిప్యూటీ సీఎంపై తీవ్ర విమర్శలు
Prakash Raj Strong Counter To Pawan Kalyan: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను అతడి ఆత్మీయ మిత్రుడు ప్రకాశ్ రాజ్ విమర్శలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. పవన్ కల్యాణ్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
Prakash Raj Rahul Gandhi: తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ వ్యవహారం జాతీయ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతున్న వేళ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా స్పందించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను నిలదీశారు. తిరుమల లడ్డూ వివాదంపై మీరు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఎందుకు దీనిపై దేశవ్యాప్తంగా రచ్చ రేపుతున్నారని తన మిత్రుడు పవన్ కల్యాణ్‌ను 'ఎక్స్' వేదికగా సూటిగా ప్రశ్నించారు.
Also Read: Pawan Kalyan: నాగుపాము ఉంగరం ధరించిన డిప్యూటీ సీఎం పవన్.. ఆ రింగ్ ధరిస్తే ఏమవుతదో తెలుసా?
'మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఇది జరిగింది. తిరుమల లడ్డూ వ్యవహారంపై విచారణ చేయండి. ఈ ఉదంతంలో దోషులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోండి. ఈ సమస్యను ఎందుకు జాతీయవ్యాప్తం చేసి రెచ్చగొడుతున్నారు. మత సంఘర్షణలు దేశానికి వద్దు. కేంద్రంలోని మీ మిత్రులకు ధన్యవాదాలు' అంటూ ప్రకాశ్ రాజ్ వ్యంగ్యంగా పవన్ కల్యాణ్‌కు కౌంటర్ ఇచ్చారు.
Also Read: Leaders Jump: జనసేనలోకి నాయకుల భారీ క్యూ.. నిండుకుంటున్న 'గాజు గ్లాస్' పార్టీ
తన మిత్రుడు పవన్ కల్యాణ్‌కు సూటిగా ప్రకాశ్ రాజ్ ప్రశ్నించడం చర్చనీయాంశంగా మారింది. సినీ పరిశ్రమలో పవన్ కల్యాణ్, ప్రకాశ్ మంచి మిత్రులు. సినిమాలపరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా వీరిద్దరూ స్నేహాపూర్వకంగా ఉంటారు. తెలుగు మూవీ అసోసియేన్ అధ్యక్ష ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్‌కు పవన్ కల్యాణ్ మద్దతు ప్రకటించారు. మా అధ్యక్షుడిగా ప్రకాశ్ ఎన్నికయ్యేందుకు పవన కల్యాణ్ ఎంతో సహకరించారు. అలాంటి పవన్ కల్యాణ్‌పై ప్రకాశ్ రాజ్ ఈ విమర్శలు చేయడం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.
రాహుల్ గాంధీ స్పందన
కాగా తిరుపతి లడ్డూ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ స్పందించారు. 'తిరుపతిలోని వేంకటేశ్వర ఆలయంలో ప్రసాదం అపవిత్రమైందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. బాలాజీ మన దేశవ్యాప్తంగా.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది పూజించే దేవుడు. ఈ సమస్య ప్రతి భక్తుడిని బాధపెడుతుంది. కల్తీపై క్షుణ్ణంగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో పుణ్యక్షేత్రాల పవిత్రతను కాపాడాలి' అని రాహుల్ కోరారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.