ప్రకాశ్ రాజ్ పోటీ చేయనున్న లోక్ సభ నియోజకవర్గం ఇదే
ప్రకాశ్ రాజ్ పోటీ చేయనున్న లోక్ సభ నియోజకవర్గం ఇదే
రానున్న 2019 లోక్ సభ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని ప్రముఖ సినీనటుడు ప్రకాశ్ రాజ్ చేసిన ప్రకటన ఇటీవల సంచలనం సృష్టించింది. అయితే, తాను ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాననే విషయంలో అప్పుడు ప్రకాశ్ రాజ్ స్పష్టత ఇవ్వలేదు. తాజాగా ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ వెల్లడించిన వివరాల ప్రకారం ఆయన బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేయనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఏఎన్ఐ ఓ ట్వీట్ చేసింది.