PK on West bengal elections: దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. దేశవ్యాప్తంగా అందరి దృష్టీ  పశ్చిమ బెంగాల్ ఎన్నికలపైనే ఉంది. అధికార టీఎంసీ తరపున రాజకీయ వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిశోర్ మరోసారి సవాల్ విసిరారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో మార్చ్ - ఏప్రిల్ నెలల్లో తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అసోం, పశ్చిమ బెంగాల్ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే నోటిఫికేషన్ వెలువడింది. దేశంలోని అన్ని రాజకీయ పార్టీల దృష్టీ పశ్చిమ బెంగాల్ ఎన్నికల( West Bengal elections)పైనే ఉంది. పశ్చిమ బెంగాల్ పీఠంపై పాగా వేసేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తుండగా..ముచ్చటగా మూడోసారి అధికారం చేజిక్కించుకునేందుకు తృణమూల్ కాంగ్రెస్ వ్యూహం రచిస్తోంది. బీజేపీ, టీఎంసీలు ఎవరికి వారు విజయం తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ టీఎంసీ( TMC) కు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న ప్రశాంత్ కిశోర్ చేసిన వ్యాఖ్యలు మరోసారి ప్రాధాన్యత సంతరించుకున్నాయి.


దేశంలో ప్రజాస్వామ్యం కోసం జరుగుతున్న కీలకపోరులో ఎవరిని గెలిపించాలో పశ్చిమ బెంగాల్ ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని ప్రశాంత్ కిషోర్( Prashant kishor) స్పష్టం చేశారు. బెంగాల్ మళ్లీ తమ సొంతబిడ్డనే కోరుకుంటోందని ప్రశాంత్ కిశోర్ ట్వీట్ చేశారు. అవసరమైతే గతంలో తాను ఇదే విషయంపై చేసిన ట్వీట్‌తో మే 2న జరిగే కౌంటింగ్‌లో సరిచూసుకోవచ్చని చెప్పారు. అలా జరగకపోతే తానే బాధ్యుడినన్నారు. 2020 డిసెంబర్ నెలలో ప్రశాంత్ కిశోర్..బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ( BJP) కు కనీసం రెండంకెల స్థానాలు కూడా రావన్నారు. అప్పుడు తాను చేసిన ట్వీట్‌కే ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని మరోసారి సవాల్ విసిరారు. పశ్చిమ బెంగాల్‌లో 8 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి.



Also read: PSLV C 51 Rocket: రేపే పీఎస్ఎల్వీ సీ 51 రాకెట్ ప్రయోగం, ప్రారంభమైన కౌంట్‌డౌన్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook