PSLV C 51 Rocket: అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్ థావన్ స్పేస్ సెంటర్ వేదికపై ఇస్రో మరో విజయానికి సిద్ధమైంది. పీఎస్ఎల్వీ సీ 51 రాకెట్ రేపు ప్రయోగానికి సిద్ధమవుతోంది. ప్రయోగానికి ఏర్పాట్లు పూర్తయి..కౌంట్‌డౌన్ ప్రారంభమైంది.
శ్రీహరికోట( Sriharikota)లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ ( SHAR ) వేదిక నుంచి ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. పూర్తి స్థాయి వాణిజ్యపరమైన మొదటి ప్రయోగంగా భావిస్తున్న పీఎస్ఎల్వీ సీ 51 ( PSLV C 51 Rocket) రాకెట్‌ను రేపు ప్రయోగించనున్నారు. ఈ ప్రయోగానికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఓ వైపు చంద్రయాన్-3, ఆదిత్య-ఎల్1, గగన్‌యాన్ ప్రయోగాలకు సిద్ధమవుతూనే వాణిజ్యపరమైన ప్రయోగాలకు పక్కా ప్లాన్ సిద్దం చేసుకుంది ఇస్రో( ISRO). ఇందులో భాగంగా రేపు అంటే ఫిబ్రవరి 28వ తేదీ ఉదయం 10 గంటల 24 నిమిషాలకు పీఎస్ఎల్వీ సీ 51 రాకెట్‌ను రోదసిలోకి పంపే క్రమంలో భాగంగా ఇవాళ ఉదయం 8 గంటల 54 నిమిషాలకు కౌంట్‌డౌన్ ప్రారంభించారు. ఈ ప్రయోగం ద్వారా బ్రెజిల్ దేశానికి చెందిన 637 కిలోల బరువైన అమెజానియా-01 ( Amazonia-01) ఉప్రగహంతో పాటు మరో 18 చిన్న ఉపగ్రహాల్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనుంది. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ( New space india limited) ప్రారంభమైన అనంతరం ఇదే తొలి వాణిజ్యపరమైన ప్రయోగం.
పీఎస్‌ఎల్వీ సీ -51 ( PSLV C 51 ) రాకెట్‌ను పీఎస్‌ఎల్వీ డీఎల్‌గా పిలుస్తారు. ఈ తరహాలో ఇది మూడవ ప్రయోగం. ఉపగ్రహాల బరువు తక్కువగా ఉండడంతో దీన్ని రెండు స్ట్రాపాన్ బూస్టర్ల సహాయంతో నిర్వహించనున్నారు. ఇందులో నాలుగవ దశలో రెండుసార్లు మండించి 18 ఉపగ్రహాలను సన్ సింక్రనిస్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెడతారు. రాకెట్‌లోని మొదటి దశ 1.49 నిమిషం పూర్తికాగానే, 2.42 నిమిషాలకు నాలుగో దశలో ఉపగ్రహాలను అమర్చిన హీట్‌షీల్డ్ విడిపోతుంది. అనంతరం రెండో దశ 4.22 నిమిషాలకు, మూడో దశ 8.15 నిమిషాలకు పూర్తి చేసి 16.36 నిమిషాలకు నాలుగో దశ కట్ అవుతుంది. తరువాత 17.23 నిమిషాలకు బ్రెజిల్‌కు చెందిన 637 కిలోల బరువు కలిగిన అమెజానియా – 01 ఉపగ్రహాన్ని భూమికి 537 కిలోమీటర్లు ఎత్తులోని సన్‌సింక్రనిస్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెడతారు. సతీష్ ధావన్ స్పేశ్ సెంటర్( Satish dhawan space centre) నుంచి ఇది 78వ ప్రయోగం కాగా పీఎస్ఎల్వీ సిరీస్‌లో 53 వ ప్రయోగంగా ఉంది. ఈ ప్రయోగం విజయవంతమైతే భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ పూర్తి స్థాయి వాణిజ్య వ్యాపారానికి మార్గం సుగమమై..అంతర్జాతీయ ఖ్యాతినార్జించనుంది.
Also read: Aadhaar card and pan card linking: మీ ఆధార్ కార్డు , పాన్‌కార్డు లింక్ కాలేదా..లేదంటే రద్దైపోతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook