Sardar Vallabhbhai Patel birth anniversary: భారతదేశ తొలి హోంమంత్రి, ఉక్కు మనిషి సర్ధార్‌ వల్లబాయ్‌ పటేల్‌ 146 జయంతి నేడు (అక్టోబర్ 31).


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశాన్ని ఐక్యం చేసిన మహనీయుడిగా ఆయనకు ప్రతేక గుర్తింపు ఉంది. అందుకే.. ఆయన జయంతినే 'దేశవ్యాప్తంగా జాతీయ ఐక్యత దినోత్సవం'గా జరుపుకుంటాం.


పటేల్​కు ప్రముఖుల నివాళులు..


వల్లబాయ్‌ పటేల్‌ జయంత్రి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. ప్రస్తుతం భారత్​ దేశీయంగా, అంతర్జాతీయంగా అన్ని సవాళ్లు ఎదుర్కోగలుగుతుందంటే అందుకు పెటేల్ ముందు చూపే కారణమని మోదీ అన్నారు. భారత చరిత్రలోనే కాదు.. ప్రతి భారతీయుడి గుండెల్లో వల్లబాయ్‌ పటేల్‌ ఉంటారని పేర్కొన్నారు.



కేంద్ర హోం మంత్రి అమిత్​ షా.. గుజరాత్​ కెవాడియాలోని ఐక్యతా విగ్రహం వద్ద ఆయనకు నివాళులర్పించారు. కేంద్ర మంత్రులు నితిన్​ గడ్కరీ, పీయూష్​ గోయల్​ సహా పలువురు ప్రముఖులు ట్విట్టర్​ వేదికగా పటేల్​కు నివాళులర్పించారు.



Also read: Amit Shah: కేందంలో మోదీ-యూపీలో యోగీ నినాదంతో అమిత్ షా


Also read: Rahul Gandhi Bike taxi ride: గోవాలో రాహుల్​ గాంధీ బైక్​ ట్యాక్సీ జర్నీ


పటేల్ నేపథ్యం..


సర్దార్ వల్లాబాయ్ పటేల్​ గుజరాత్​లోని (అప్పట్లో బాంబే ప్రసిడెన్సి) నాడియాడ్​లోని ఓ కుగ్రామంలో 1875 అక్టోబర్ 31న జన్మించారు. ఆయన తల్లి లాడ్​ బాయి, తండ్రి జావర్ బాయ్​. వాళ్లది ఓ సాధారణ రైతు కుటుంబం.


చిన్నప్పటి నుంచే పటేల్​ది ఎదిరించే మనస్తత్వం. ఆయన ఎంతో ధైర్వవంతులు కూడా. అందుకే ఆయనకు ఉక్కు మనిషి అనే బిరుదు కూడా వచ్చింది.


మహాత్మా గాంధీ సిద్ధాంతాలకు ఆకర్షితులైన పటేల్​.. స్వాతంత్ర్య సంగ్రామంలో అడుగు పెట్టారు. న్యాయవాది అయిన పటేల్​.. ముందునుంచే మహాత్మాగాంధీ మద్దతుదారుడు.
1918లో గాంధీ అధ్వర్యంలో నిర్వహించిన ఖేదా సత్యాగ్రహంలో పాల్గొని గాంధీకి అత్యంత సన్నిహితుడిగా మారారు. ఈ సత్యాగ్రహం విజయవంతమైన తర్వాత వీరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది.


స్వాతంత్ర్య ఉద్యమం ఉద్ధృతవుతున్న తరుణంలో.. న్యాయవాద వృత్తిని వదిలేసి.. పూర్తి స్థాయిలో ఉద్యమంలో భాగమయ్యారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకీ ప్రవేశించారు. ప్రజలను స్వాతంత్ర్య సమరంలో భాగం చేయడంలో పటేల్ ఎంతో కీలక పాత్ర పోషించారు.


1931 మార్చిలో నిర్వహించిన భారత జాతీయ కాంగ్రెస్ 46వ సమావేశానికి పటేల్ అధ్యక్షత వహించారు.


Also read: Pm Modi with Global Leaders: ప్రపంచనేతలతో ప్రధాని మోదీ..ఎనర్జీ చూసి ఫిదా


Also read: RSS: మతం మారితే బహిరంగం చేయాల్సిందే, ఆర్ఎస్ఎస్ కీలక వ్యాఖ్యలు


స్వాతంత్ర్యం అనంతరం..


భారత్​క్​కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పటేల్ భారత తొలి ఉప ప్రధాన మంత్రిగా, హోం మంత్రిగా, ఇన్ఫర్మేషన్ బ్రాడ్​ కాస్టింగ్​ శాఖల బాధ్యతలను నిర్వహించారు.


స్వాతంత్ర్యం వచ్చిన తొలి నాళ్లలో రాజుల పాలనలో ఉన్న.. రాజ్యాలను భారతల్​లో విలినం చేయడంలో పటేల్ ముఖ్యపాత్ర వహించారు. 550కిపైగా చిన్న చిన్న రాజ్యాలను భారత్​లో ఆయన విలీనం చేశారు.


హైదరాబాద్​ రాష్ట్రాన్ని విలీనం చేసేందుకు అంగీకరించని నిజాం రాజుపై పటేల్ ఉక్కు పాదం మోపారు. చివరకు శాంతియుతంగానే హైదరాబాద్​ను భారత్​లో ఏకం చేశారు.


బ్రిటీష్​ నుంచి విముక్తి కోసం.. స్వదేశంలో శాంతి స్థాపనకు పటేల్ ఎంతో శ్రమించారు. చివరకు ఆయన 1950 డిసెంబర్ 15న తుది శ్వాస విడిచారు. గుండె పోటు కారణంగా ఆయన మృతి చెందారన్న వార్త తెలిసి దేశమంత శోక సంద్రంలో మునిగి పోయింది. ఆయన సేవలకు గుర్తింపుగా.. 1991లో భారత రత్న అవార్డును ప్రదానం చేసింది ప్రభుత్వం.


Also read: Mamata Banerjee: మమత టార్గెట్ మారిందా, కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడిన దీదీ


Also read: Lanino Effect: ఈసారి ఉత్తరాది వణికిపోనుందా, భారీగా పడిపోనున్న ఉష్ణోగ్రతలు