Amit Shah: కేందంలో మోదీ-యూపీలో యోగీ నినాదంతో అమిత్ షా

Amit Shah: ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు అధికారపార్టీ బీజేపీ అప్పుడే సిద్ధమైపోయింది. 2022లో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఆ పార్టీ కీలక నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా శ్రీకారం చుట్టినట్టే కన్పిస్తోంది. మేరా పరివార్ బీజేపీ పరివార్ కార్యక్రమంలో ఆయన కొత్త నినాదమిచ్చారు.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 30, 2021, 07:45 AM IST
  • మేరా పరివార్-బీజేపీ పరివార్ కార్యక్రమాన్ని లక్నోలో ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
  • కేంద్రంలో మోదీ రావాలంటే యూపిలో యోగీ రావాలని పిలుపునిచ్చిన అమిత్ షా
  • ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా నేతృత్వంలో అయోద్యలో రామమందిర నిర్మాణమంటూ యోగీ ప్రశంసలు
Amit Shah: కేందంలో మోదీ-యూపీలో యోగీ నినాదంతో అమిత్ షా

Amit Shah: ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు అధికారపార్టీ బీజేపీ అప్పుడే సిద్ధమైపోయింది. 2022లో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఆ పార్టీ కీలక నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా శ్రీకారం చుట్టినట్టే కన్పిస్తోంది. మేరా పరివార్ బీజేపీ పరివార్ కార్యక్రమంలో ఆయన కొత్త నినాదమిచ్చారు.

కేంద్రంలో మోదీ-యూపీలో యోగీ ఇదే ఇప్పుడు బీజేపీ(Bjp New Slogan)కొత్త నినాదంగా ఉంది. సాక్షాత్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నినాదాన్ని ఎత్తారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో పర్యటించిన అమిత్ షా..మేరా పరివార్-బీజేపీ పరివార్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రస్తావన తీసుకొచ్చారు. 2024లో కేంద్రంలో నరేంద్రమోదీని(Narendra Modi)మరోసారి ప్రధానిగా చేయాలంటే..2022లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో(Up Assembly Elections 2022) బీజేపీని మరోసారి గెలిపించి యోగీని ముఖ్యమంత్రి చేయాలని అమిత్ షా(Amit Shah)పిలుపునిచ్చారు.కేంద్రంలో మోదీ-యూపీలో యోగీ అంటూ నినాదం చేశారు. యోగీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. 

దేశంలో యూపీను నెంబర్‌వన్ రాష్ట్రంగా మార్చేందుకు మరో ఐదేళ్లు బీజేపీ(Bjp) అధికారంలో ఉండాల్సిన అవసరముందన్నారు. రాష్ట్రంలో మాఫియాను తరిమికొట్టే అతిపెద్ద పనిని యోగి ఆదిత్యనాథ్ పూర్తి చేశారని ప్రశంసించారు. రాష్ట్రంలో 1 లక్షా 43 వేల మందికి పైగా పోలీసు సిబ్బంది నియామకంలో ఎక్కడా ఎటువంటి అవినీతి జరగలేదని గుర్తు చేశారు. అటు ప్రతిపక్షం సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌లపై అమిత్ షా విరుచుకుపడ్డారు. కరోనా సంక్రమణ, వరదల సమయంలో అఖిలేష్ యాదవ్, రాహుల్ గాంధీ ఎక్కడున్నారని ప్రశ్నించారు. 2014లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాతే దేశప్రజలు ఊపిరి పీల్చుకున్నారని అమిత్ షా (Amit shah)తెలిపారు.యూపీలో 2022లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా 3 వందలకు పైగా సీట్లు గెల్చుకోవాలని బీజేపీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. 

మరోవైపు ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ కలను ప్రధాని నరేంద్ర మోదీ సాకారం చేసారని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath) తెలిపారు. మోదీ నేతృత్వంలో దేశంలో కొత్త చైతన్యం వచ్చిందని చెప్పారు. దేశంలో మరో 1.5 కోట్లమంది కొత్త కార్యకర్తల్ని తయారు చేసుకోవడమే లక్ష్యమన్నారు. మోదీ-అమిత్ షా నేతృత్వాన అయోధ్యలో భవ్య రామమందిర(Ayodhya Rammandir)నిర్మాణం జరుగుతుండటంపై ప్రజలంతా గర్వపడుతున్నారన్నారు. 

Also read; Huzurabad Bypoll: ప్రతిష్ఠాత్మకంగా మారిన హుజూరాబాద్ ఉపఎన్నిక నేడే, నువ్వా నేనా రీతిలో పోటీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News