RSS: మతం మారితే బహిరంగం చేయాల్సిందే, ఆర్ఎస్ఎస్ కీలక వ్యాఖ్యలు

RSS: మత మార్పిళ్లపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఎవరైనా చట్టం మారితే తప్పనిసరిగా బహిరంగంగా వెల్లడించాలని స్పష్టం చేసింది. మత మార్పిడి నిరోధక చట్టాన్ని ఆర్ఎస్ఎస్ స్వాగతిస్తుందని వెల్లడించింది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 31, 2021, 07:16 AM IST
  • మత మార్పిడులపై ఆర్ఎస్ఎస్ కీలక వ్యాఖ్యలు
  • ఎవరైనా మతం మార్చుకుంటే బహిరంగంగా వెల్లడించాలని స్పష్టీకరణ
  • మత మార్పిడికి ఆర్ఎఎస్ఎస్ వ్యతిరేకం, చట్టాన్ని తీసుకొస్తే మద్దతు
RSS: మతం మారితే బహిరంగం చేయాల్సిందే, ఆర్ఎస్ఎస్ కీలక వ్యాఖ్యలు

RSS: మత మార్పిళ్లపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఎవరైనా చట్టం మారితే తప్పనిసరిగా బహిరంగంగా వెల్లడించాలని స్పష్టం చేసింది. మత మార్పిడి నిరోధక చట్టాన్ని ఆర్ఎస్ఎస్ స్వాగతిస్తుందని వెల్లడించింది.

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(Rashtriya Swayamsevak Sangh)స్పష్టం చేసింది. అఖిల భారతీయ కార్యకారి మండల్ మూడ్రోజుల సమావేశంలో ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే తెలిపారు. మత మార్పిడులను నిరోధించాలని..ఎవరైనా ఒకవేళ మతం మారితే బహిరంగంగా వెల్లడించాలని ఆర్ఎస్ఎస్ నేత దత్తాత్రేయ వెల్లడించారు. మతమార్పిడుల్ని నిరోధించాలన్నదే ఆరెస్సెస్‌ విధానమన్నారు. మతం మారిన తరువాత కూడా బయటపెట్టకపోతే వారు రెండు రకాలుగా లబ్ధిని పొందుతున్నట్టేనని గుర్తు చేశారు. బలవంతపు మత మార్పిడుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించకూడదని అన్నారు. అందుకే మత మార్పిడి నిరోధక చట్టాన్ని మైనార్టీలు వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. బలవంతగా మత మార్పిడిని(Religious Conversion)ఆరెస్సెసే కాదు మహాత్మా గాంధీ కూడా వ్యతిరేకించారని చెప్పారు. దేశంలో ఇప్పటివరకు పదికి పైగా రాష్ట్రాలు మత మార్పిడి వ్యతిరేక చట్టాన్ని తీసుకువచ్చాయన్నారు. హిమాచల్‌‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ హయాంలోనే వీరభద్రసింగ్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ చట్టాన్ని తీసుకువచ్చారని ఆయన గుర్తు చేశారు.

Also read: India Bypolls: దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఎన్ని స్థానాల్లో ఇవాళ ఉపఎన్నిక

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News