Pulwama Attack Black Day: పుల్వామా ఉగ్రదాడికి మూడేళ్లు.. అమరవీరులకు ప్రధాని మోదీ నివాళులు
Pulwama Attack Black Day: పుల్వామా ఉగ్రదాడికి నేటితో మూడేళ్లు గడిచాయి. 2019 ఫిబ్రవరి 14న జరిగిన ఈ ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమరవీరులకు నివాళులు అర్పించారు.
Pulwama Attack Black Day: సరిగ్గా మూడేళ్ల క్రితం ఇదే రోజున (2019 ఫిబ్రవరి 14) జమ్మూకశ్మీర్ లోని పుల్వామాలో ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు తమ ప్రాణాలను కోల్పోయారు. ఈ దుర్ఘటన జరిగి మూడేళ్లు పూర్తైన సందర్భంగా ఆనాడు ప్రాణాలను అర్పించిన అమరవీరులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.
"2019లో ఇదే రోజున పుల్వామాలో అమరులైన జవాన్లకు నా నివాళులు అర్పిస్తున్నాను. మన దేశానికి వారు చేసిన విశిష్ట సేవలను నేను ఈ సందర్భంగా స్మరించుకుంటున్నాను. అమరవీరుల శౌర్యం, అత్యున్నత త్యాగం.. బలమైన, సంపన్న దేశంగా మార్చేందుకు ప్రతి భారతీయుడిని ప్రేరేపిస్తుంది" అని భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.
2019 ఫిబ్రవరి 14న పుల్వామా మీదుగా వెళ్తున్న సీఆర్పీఆఫ్ వాహానాన్ని టార్గెట్ చేసుకొని ఈ ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అసువులుబాశారు. పాకిస్థాన్ కు చెందిన జైషే మహమ్మద్ ఉగ్రవాదులు ఈ కుట్రకు పాల్పడ్డారు. దీనికి ప్రతీకారంగా భారత్ 2019 ఫిబ్రవరి 26న పాకిస్థాన్‌లోని బాలాకోట్ ఉగ్ర స్థావరంపై సర్జికల్ స్ట్రైక్ చేసింది. ఈ సర్జికల్ స్ట్రైక్ లో దాదాపుగా 300 మంది ఉగ్రవాదులు హతమైనట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Also Read: Chinese Apps Ban: చైనాకు భారత్ షాక్... మరో 54 చైనా యాప్‌లపై కేంద్రం నిషేధం..!
Also Read: ISRO C52: విజయవంతంగా పీఎస్ఎల్‌వి సి 52, ఆ మూడు ఉపగ్రహాల ప్రత్యేకతలివే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook