Private companies in space: భారత అంతరిక్షరంగంలో ( Indian space sector ) ఓ కొత్త చరిత్ర లిఖితమవుతోంది. ఇకపై దేశ అంతరిక్ష కార్యకలాపాల్లో ప్రైవేటు పెట్టుబడులు రానున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఇస్రో ( ISRO ) కూడా స్వాగతించింది. ఈ పరిణామాలన్నింటినీ పరిశీలిస్తోంటే.. భారత అంతరిక్ష రంగం గ్లోబల్ స్పేస్ ఎకానమీకి హబ్‌గా మారనుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇస్రో చైర్మన్ కే శివన్ ( Isro Chairman k Sivan ) ఇదే విషయంపై మాట్లాడుతూ.. ఇది కచ్చితంగా ఆహ్వానించదగిన పరిణామం అని అన్నారు. " ప్రభుత్వ సంస్కరణల్ని యువత వినియోగించుకుంటుందని ఆశిస్తున్నాను. ఇప్పటికే కొన్ని స్టార్టప్ కంపెనీలు మమ్మల్ని సంప్రదించాయి. గ్లోబల్ స్పేస్ ఎకానమీకి ఇండియా హబ్‌గా మారుతుందని నమ్ముతున్నాను. అంతరిక్ష కార్యకలాపాల్లో ప్రైవేటు కంపెనీల రాకను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను" అని అన్నారు.  


అంతరిక్ష రంగంలో ప్రైవేటు పెట్టుబడులకు అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏ మేరకు ప్రయోజనకరమో చెప్పడానికి ఇస్రో చీఫ్ కే శివన్ అభిప్రాయం వింటే అర్థమవుతుంది. దేశీయ ఆంతరిక్ష కార్యకలాపాల్లో ఇది కచ్చితంగా ఓ కొత్త చరిత్రను లిఖించనుంది. ఇకపై ఉపగ్రహాలు, రాకెట్ల నిర్మాణం, ప్రయోగం, గ్రహాంతర యాత్రల్లో ప్రైవేటు కంపెనీలు పాల్గొనడం ద్వారా ఈ రంగం మరింత అభివృద్ధి చెందనుంది. ఎందుకంటే దేశంలో ప్రైవేట్ అంతరిక్ష కార్యకలాపాల్ని పర్యవేక్షించేందుకు ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రొమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ ( ఇన్ స్పేస్ ) ( Indian national space promotion and authorisation centre ) ( IN- SPAC ) అనే నూతన సంస్థ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో దేశ అంతరిక్ష పరిజ్ఞానాన్ని దేశాభివృద్ధి కోసం వినియోగించుకోడానికి ఆస్కారం లభిస్తుందని ఇస్రో ఛైర్మన్ శివన్ స్పష్టం చేయడం గమనార్హం.


ఇస్రోపై ప్రభావం చూపుతుందా ?
ఈ కొత్త నిర్ణయాలేవీ ఇస్రో పాత్రను ఏ మేరకూ తగ్గించవని కే శివన్ వెల్లడించారు. ఇస్రో ప్రయోగాలు కొనసాగుతూనే ఉంటాయని... ముఖ్యంగా ఆర్ అండ్ డీ, ఇతర గ్రహాలపై ప్రయోగాలు, మానవ సహిత అంతరిక్ష యాత్రలుంటాయని ఆయన చెప్పారు. ఈ కొత్త సెంటర్‌‌ను పూర్తి స్తాయిలో సిద్ధం చేయడానికి 3-6 నెలల సమయం పడుతుందని కే శివన్ చెప్పుకొచ్చారు.