Aadhaar Lock & Unlock: మీ ఆధార్ దుర్వినియోగం అయిందా ? ఇలా లాక్ చేసి అన్ లాక్ చేయండి!
ఈ రోజుల్లో ఆధార్ కార్డు ( Aadhaar Card ) అత్యంత ప్రధానమైన డాక్యుమెంట్ లలో ఒకటిగా మారింది. ఎన్నో అధికారిక పనులకు ఆధార్ కార్డు అవసరం పెరిగింది.
ఈ రోజుల్లో ఆధార్ కార్డు ( Aadhaar Card ) అత్యంత ప్రధానమైన డాక్యుమెంట్ లలో ఒకటిగా మారింది. ఎన్నో అధికారిక పనులకు ఆధార్ కార్డు అవసరం పెరిగింది. బ్యాంకు ( Bank ) సంబంధిత పనులు ఆధార్ కార్డు లేకుండా ముందుకు సాగవు. అందుకే మన ఆధార్ కార్డు ఇతరుల వల్ల దుర్వినియోగం జరగకుండా ఉండేలా జాగ్రత్త పడటం చాలా అవసరం. మీక్కూడా మీ ఆధార్ కార్డు.. లేదా ఆధార్ కార్డు నెంబర్ దుర్వినియోగం జరిగింది అని అనిపిస్తే మీరు మీ ఆధార్ కార్డును లాక్ చేసుకోవచ్చు. అది కూడా వెంటనే.
ఆధార్ కార్డు నెంబర్ ను లాక్ చేయడం ఎలా ? ( How can you lock your Aadhaar number? )
దాని కోసం ముందుగా మీరు UIDAI పోర్టల్ ను విజిట్ చేయాల్సి ఉంటుంది. UIDAI పోర్టల్ కోసం మీరు https://resident.uidai.gov.in/ ను విజిట్ చేసి అందులో రిజిస్ట్రేషన్ ఫాల్మాలిటీస్ పూర్తి చేసి వెంటనే లాక్ చేసుకోవచ్చు. ఆధార్ సర్వీసెస్ ( Aadhaar Services) అనే ఆప్షన్ మీకు మై ఆధార్ అనే ట్యాబ్ లో కనిపిస్తుంది.
అందులో లాక్ / అన్ లాక్ బయోమెట్రిక్ పై క్లిక్ చేయండి. తరువాత మీ 12 సంఖ్యల ఆధార్ కార్డు నెంబర్ ను లేదా వర్చువల్ ఐడిని ఎంటర్ చేయండి. తరువాత ఓటిపి సెండ్ ఆప్షన్ ను ఎంచుకోండి. దీని కన్నా ముందు క్యాప్చా పూర్తి చేయాలి. ఓటిపి ఎంటర్ చేశాక. మీ బయోమెట్రిక్ డాటాను మీరు అన్ లాక్ చేసుకోవచ్చు. లాక్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే మీ డాటా లాక్ అవుతుంది.
ఆధార్ కార్డు నెంబర్ ను అన్ లాక్ చేయడం ఎలా ? (How can you unlock your Aadhaar number? )
పైన వివరించిన విధానాన్ని పాటించి మీరు మీ ఆధార్ కార్డును అన్ లాక్ చేసుకోవచ్చు.