Metro rail: మెట్రోరైలును అప్పుడే వద్దంటున్న జనం
కరోనా వైరస్ మనిషిని ( Corona virus fear ) ఎంతగా భయపెట్టాలో అంతగా భయపెట్టేసింది. కోవిడ్ 19 వైరస్ సంక్రమణ ( covid 19 spread ) నేపధ్యంలో ఏది అవసరం..ఏది కాదనేది ప్రజలు పూర్తిగా గ్రహిస్తున్నారా లేదా అంటే...లోకల్ సర్కిల్స్ ( LocalCircles survey ) సర్వే ప్రకారం అవుననే అన్పిస్తోంది. అందుకే ఇప్పుడు ప్రజలు మెట్రోరైలుకు ససేమిరా ( metro journey ) అంటున్నారు...పూర్తి వివరాలు ఇవీ..
కరోనా వైరస్ మనిషిని ( Corona fear ) ఎంతగా భయపెట్టాలో అంతగా భయపెట్టేసింది. కోవిడ్ 19 వైరస్ సంక్రమణ ( covid 19 spread ) నేపధ్యంలో ఏది అవసరం..ఏది కాదనేది ప్రజలు పూర్తిగా గ్రహిస్తున్నారా లేదా అంటే...లోకల్ సర్కిల్స్ ( LocalCircles survey ) సర్వే ప్రకారం అవుననే అన్పిస్తోంది. అందుకే ఇప్పుడు ప్రజలు మెట్రోరైలుకు ససేమిరా ( Metro railjourney ) అంటున్నారు...పూర్తి వివరాలు ఇవీ..
కరోనా లాక్ డౌన్ ల ( lockdown ) కాలం ముగిసింది. ఇప్పుడు అన్ లాక్ ( unlock 1 ) ల కాలం నడుస్తోంది. నెమ్మది నెమ్మదిగా జీవితాన్ని తిరిగి గాడిలో తెచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఒక్కొక్కటిగా అన్ని తెర్చుకుంటున్నాయి. అయితే మార్చ్ నుంచి నిలిచిపోయిన మెట్రో, లోకల్ రైళ్లు ( metro-local services ) మాత్రం ఇప్పట్లో తెర్చుకునేలా లేవు. వివిధ ప్రాంతాల్లో LocalCircles జరిపిన సర్వేలో ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి.
Also read : 99 ఏళ్ల వయస్సులో కరోనా నుంచి కోలుకున్న బామ్మ
అన్‌లాక్ 2లో ఎలాంటి సౌకర్యాల్ని ప్రజలు ఆశిస్తున్నారు ? ఏవి అవసరం లేదనుకుంటున్నారనే అంశాలపై దేశవ్యాప్తంగా 241 జిల్లాల్లో సర్వే( survey in 241 districts ) జరిగింది. ఈ సర్వేలో పలు ఆసక్తికర అంశాలు జనం వెలుగుచూశాయి. ముఖ్యంగా మెట్రో రైళ్లు, లోకల్ రైళ్లను ఒకవేళ అన్ లాక్ 2లో ( unlock 2 ) ప్రారంభించినా సరే...ప్రయాణం చేయమని ఏకంగా 67 శాతం మంది తేల్చి చెప్పారు. జిమ్స్, స్విమ్మింగ్ ఫూల్స్ ( Gyms & Swimming pool ) కు కూడా కేవలం 15 శాత మంది మాత్రమే ఆసక్తి చూపించారు. రానున్న 3 నెలల వరకూ విహారయాత్రలు, , హూటల్ స్టేకు కూడా నో చెబుతున్నారు. వీటికైతే ఏకంగా 93 శాతం నో చెప్పారు. రేపటితో అంటే జూన్ 30తో అన్ లాక్ 1 ముగియనున్న నేపధ్యంలో ఈ సర్వే ( survey on metro journey ) ప్రాధాన్యత సంతరించుకుంది.
దేశవ్యాప్తంగా 241 జిల్లాల్లో జరిపిన ఈ సర్వేలో 24 వేల మంది నుంచి సమాధానాలు వచ్చాయి. వీలైనంత మెట్రో రైళ్లను పునరుద్ధరిస్తామని ఢిల్లీ మెట్రో ( Delhi metro corporation ) ప్రకటించడం, అటు జూన్ 15 నుంచి ముంబాయిలో లోకల్ రైళ్లు ( Mumbai local trains ) ప్రారంభమైనా సరే ప్రయాణీకుల్నించి స్పందన లేకపోవడంతో ఈ సర్వేకు ప్రాముఖ్యత ఏర్పడింది.
Also read : దిల్లీలో మరో రెండ్రోజుల్లో ప్లాస్మా బ్యాంకు
రానున్న నెల రోజుల వ్యవధిలో మెట్రో, లోకల్ రైళ్లను ఉపయోగించుకుంటామని కేవలం 25 శాతమే సంసిద్ధత వ్యక్తం చేశారు. పెట్రో ధరలు , క్యాబ్ ల ధరలు విపరీతంగా పెరిగినా సరే కరోనా భయం ప్రజల్ని ఇంకా వెంటాడుతూనే ఉంది. అందుకే అధిక శాతం ప్రజలు మెట్రో ప్రయాణానికి ఇంకా నో అంటున్నారు.
లోకల్ సర్కిల్స్ ( LocalCircles ) అనేది ఓ సోషల్ నెట్ వర్కింగ్ ప్లాట్ ఫామ్. గతంలో ఇండో చైనా సరిహద్దు వివాదం ( Indo china border dispute) నేపద్యంలో చైనీ వస్తువుల్ని బహిష్కరించాలా వద్దా అనే అంశంపై ఇదే సంస్థ నిర్వహించిన సర్వేలో 87 శాతం ప్రజలు బాయ్ కాట్ చేస్తామని స్పందించారు.