కరోనా వైరస్ మహమ్మారి ( corona pandemic ) నుంచి వృద్ధులు, పిల్లలు దూరంగా ఉండాలనేది వైద్యులు పదేపదే చెబుతున్న మాట. కానీ కొంతమంది విషయంలో కరోనానే దూరంగా పారిపోతోంది. ఆశ్చర్యంగా ఉందా...చదవండి మరి..
కరోనా విషయంలో నడిపించేదంతా రోగ నిరోధక శక్తినే. ఈ శక్తి ఉంటే వయస్సుతో సంబంధమేం లేదు. ఈ శక్తి ఉంటే కరోనా పారిపోవల్సిందే. అదే జరిగింది. బెంగుళూరుకు చెందిన 99 ఏళ్ల ఓ బామ్మకు కరోనా సోకింది. అయితే ఆశ్చర్యంగా కేవలం 9 రోజుల్లో కోలుకుి డిశ్చార్చ్ కూడా అయ్యారీమె. . వైద్యుల్ని సైతం ఆశ్చర్యపర్చిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి…
Also read : Dexamethasone: కోవిడ్ 19 కు మరో మందు
బెంగుళూరుకు చెందిన 99 ఏళ్ల బామ్మకు తన మనవడి కారణంగా కరోనా సోకింది. ఇద్దరూ నగరంలోని విక్టోరియా ఆస్పత్రిలో ( Banglore victoria hospital ) జూన్ 18న చేరారు. అంత వయస్సున్నా సరే...చికిత్సకు ఆమె శరీరం పూర్తిగా సహకరించింది. కేవలం 9 రోజుల వ్యవధిలో మనవడితో సహా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈమె కుటుంబంలో కొడుకు , కోడలు ఇంకా చికిత్స పొందుతున్నారు ఇదే ఆస్పత్రిలో.
ఆశ్చర్యమేమంటే...99 ఏళ్ల బామ్మకు తప్ప..కుటుంబంలో మిగిలిన ముగ్గురికీ కరోనా లక్షణాలు కూడా వెలుగు చూశాయి. బామ్మకు మాత్రం ఎసింప్టమెటిక్ కరోనా పాజిటివ్ గా తేలింది. లక్షణాల్లేనప్పుడు ఎందుకు ఆస్పత్రిలో చేరాలంటూ బామ్మ తొలుత నిరాకరించినా...వయస్సు రీత్యా వైద్యులు నచ్చజెప్పారట. అందర్నీ ఆశ్చర్యపరుస్తూ కేవలం 9 రోజుల్లోనే కోలుకుని ఇంటి ముఖం పట్టారు. బామ్మకున్న పాజిటివ్ నెస్, రోగ నిరోధక శక్తే ఆమెను కాపాడాయంటున్నారు వైద్యులు.