ZEEL-Invesco Case: జీ ఎంటర్‌టైన్మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌ని చట్టవిరుద్ధంగా కబ్జా చేయాలని చూసిన ఇన్వెస్కో అసలు రంగును బట్టబయలైంది. జీ ఎంటర్‌టైన్మెంట్‌ని హస్తగతం చేసుకోవాలన్న ఇన్వెస్కో ద్వంద వైఖరిని జీల్ ఎండీ, సీఇవో పునీత్ గోయెంక జీల్ బోర్డు ఎదుటే బట్టబయలు చేశారు. అక్టోబర్ 12న జరిగిన జీల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్‌లో పునీత్ గోయెంక డైరెక్టర్ల ఎదుట ఓ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇదే ఏడాది ఫిబ్రవరిలో ఇన్వెస్కో ప్రతినిధితో జరిగిన చర్చల సారాంశాన్ని పునీత్ గోయెంకా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌కు వివరించారు. అంతేకాకుండా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ BSE, NSE లకు ఓ లేఖ కూడా రాసినట్టు పునీత్ గోయెంకా తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇన్వెస్కో విషయంలోనే సమావేశమైన ZEEL Board: 
జీల్ బోర్డును ఇబ్బందిపెట్టేలా సాగిన ఇన్వెస్కో ద్వంద్వ ప్రమాణాలను పునీత్ గోయెంకా బహిర్గతం చేసారు. ఇన్వెస్కో ప్రతినిధులు ఒక స్ట్రాటెజిక్ గ్రూప్‌లో విలీనం చేసేలా ఓ ప్రతిపాదనను తీసుకొచ్చారని గోయెంకా స్పష్టం చేశారు. ఈ చర్చల్లో ఇన్వెస్కో తరపున అరుణ్ బలోని అలాగే ఓఎఫ్ఐ గ్లోబల్ చైనా ఫండ్‌కి చెందిన భవతోష్ వాజ్‌పేయి కూడా పాల్గొన్నారు. స్ట్రాటెజిక్ గ్రూప్ ప్రతిపాదన చేయడంతో పాటు ఆ గ్రూప్ వ్యాల్యూ కూడా మరింత పెంచి చూపించారని పునీత్ గోయెంక పేర్కొన్నారు.


Also read : ZEEL, Sony merger deal value: జీ ఎంటర్‌టైన్మెంట్, సోనీ పిక్చర్స్ విలీనం.. ఎవరి బలాలు ఎంత ?


Loss to ZEEL promoters - ఈ ఒప్పందం వల్ల పెట్టుబడిదారులకు 10 వేల కోట్ల నష్టం జరిగి ఉండేదన్న గోయెంకా..
ఇన్వెస్కో చేసిన డీల్ కారణంగా ZEEL పెట్టుబడిదారులు రూ. 10 వేల కోట్ల నష్టాన్ని ఎదుర్కోవాల్సి వచ్చేదని పునీత్ గోయెంకా స్పష్టంచేశారు. విలీన సంస్థలో జీల్ ప్రమోటర్లు కేవలం 3.99% వాటాను మాత్రమే పొందుతారని సంచలన విషయాన్ని బయటపెట్టిన పునీత్ గోయెంకా.. విలీన సంస్థలో తనకు 4% ESOP తో పాటు మేనిజింగ్ డైరెక్టర్, సీఈఓగా కొనసాగే అవకాశం కల్పించనున్నట్టు ఆ ప్రతిపాదనలో పేర్కొన్నారని తెలిపారు. ఒకవేళ ఇన్వెస్కో ప్రతిపాదించిన విధంగా ఒప్పందం కానీ జరిగితే, సదరు స్ట్రాటెజిక్ గ్రూప్‌కి విలీనం తర్వాత ఏర్పడే కొత్త కంపెనీలో మెజారిటీ వాటాను కలిగి ఉంటుందని గోయెంకా చెప్పారు. 


What Invesco offered to Punit Goenka - గోయెంకాకు ఇన్వెస్కో ఏం ఆఫర్ చేసిందంటే..
బోర్డ్ నోట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం, ఇన్వెస్కో గోయెంకా ఎదుట ప్రతిపాదనను తీసుకొచ్చే సమయంలో ఆయనకు కొన్ని హామీలు ఇచ్చింది. కొత్త విలీన సంస్థ వ్యాపార కార్యకలాపాలు పునీత్ గోయెంకా నేతృత్వంలోనే (Punit Goenka leadership) కొనసాగుతాయని.. ఆయన వృత్తి నైపుణ్యం, శక్తి సామర్థ్యాలు విలీన సంస్థకు ఉపయోగపడతాయని ఇన్వెస్కో అభిప్రాయపడింది.


Also read : ZEEL-Sony MEGA Merger Deal:జీల్- సోనీ విలీనం గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు


Who is behind Invesco - ఇన్వెస్కో వెనుక ఇంకెవరైనా ఉన్నారా ?
ZEEL బోర్డ్ విడుదల చేసిన ఓ లేఖ ప్రకారం, ఇన్వెస్కో చేసిన ప్రతిపాదన, ఒప్పందంలో ఎదురయ్యే కొన్ని పాలనాపరమైన సమస్యలను పునీత్ గోయెంకా ప్రస్తావించారు. ముఖ్యంగా ఇన్వెస్కో తీసుకొస్తున్న స్ట్రాటెజిక్ గ్రూప్ వ్యాల్యుయేషన్ గురించి పునీత్ గోయెంకా పలు ప్రశ్నలు లేవనెత్తారు. దీంతో తన అసలు రంగు బయటపెట్టిన ఇన్వెస్కో.. పునీత్ గోయెంకా లేకుండా కూడా ఈ డీల్‌ని పూర్తి చేయవచ్చని చెప్పి తన మోసపూరిత వైఖరిని బయటపెట్టుకుంది. కాకపోతే విలీనం అనంతరం ఏర్పడే కొత్త సంస్థను అభివృద్ధిపథంలో నడిపించేందుకు మళ్లీ పునిత్ గోయెంకా (Punit Goenka expertise and experience) అనుభవం, తెలివితేటలు ఎంతో అవసరం అని.. అంతేకాకుండా అతను లేకపోవడం వల్ల షేర్ హోల్డర్స్ వ్యాల్యూ కూడా పడిపోతుందని ఇన్వెస్కో భావించింది. 


ఈ విషయంలో తాను (పునీత్ గోయెంకా) ఇంకా మొండిపట్టుకుపోతే.. ఈ డీల్ కుదరకపోవడం వల్ల నష్టపోయేది మీ కుటుంబమేనని పరోక్షంగా హెచ్చరికలు చేసిందని పునీత్ గోయెంక ఇన్వెస్కో (Invesco fraud exposed) అసలు రంగును బయటపెట్టారు.


Also read :ZEEL-Sony MEGA Merger: జీల్, సోనీ విలీన సంస్థలో వాటాల వివరాలు, వ్యూహ్యాత్మక అంశాలు ఇవే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook