ZEEL-Sony merger: జీల్-సోనీ విలీనంపై ఇన్వెస్కో అసంతృప్తి.. Invesco ప్రతిపాదించిన బోర్డు సభ్యుల అర్హతలు

Invesco upset with ZEEL-Sony mega merger: జీల్ - సోని పిక్చర్స్ విలీనం అంశాన్ని ఇన్వెస్కో ఎందుకు అడ్డుకుంటోంది ? ఇన్వెస్కో ప్రతిపాదించిన బోర్డ్‌లో ఉన్న సభ్యులు ఎవరు ? వారి యోగ్యతలు ఏంటనే వివరాలపై ఓ స్మాల్ లుక్కేద్దాం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 27, 2021, 07:19 PM IST
  • జీ ఎంటర్‌టైన్మెంట్ ఎంటర్‌ప్రైజెస్, సోని పిక్చర్స్ నెట్‌వర్క్ ఇండియా విలీనంపై ఇన్వెస్కో ఎందుకు అక్కసం వెళ్లగక్కుతోంది (ZEEL-Sony merger deal) ?
  • జీల్ బోర్డులో (ZEEL board) మార్పులకు ఇన్వెస్కో ఎందుకు పట్టుబడుతోంది ?
  • ఏ హక్కుతో ఇన్వెస్కో (Invesco) ఏ బలమైన ప్రతిపాదన లేకుండానే బోర్డు మెంబర్స్‌ని ప్రతిపాదిస్తోంది ?
  • ఇన్వెస్కోకు జీ బిజినెస్ సంధిస్తున్న సూటి ప్రశ్నలు
ZEEL-Sony merger: జీల్-సోనీ విలీనంపై ఇన్వెస్కో అసంతృప్తి.. Invesco ప్రతిపాదించిన బోర్డు సభ్యుల అర్హతలు

Invesco upset with ZEEL-Sony mega merger: జీ ఎంటర్‌టైన్మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్, సోని పిక్చర్స్ నెట్‌వర్క్ ఇండియా విలీనంపై అన్నివర్గాలు హర్షం వ్యక్తంచేసి స్వాగతించినప్పటికీ.. ఇన్వెస్కో మాత్రం ఈ విలీనంపై అసంతృప్తి వ్యక్తంచేస్తూనే ఇప్పటికీ జీల్ బోర్డు సభ్యులను మార్చాల్సిందిగా మొండిపట్టుపడుతోంది. అలాగని ఇన్వెస్కో ప్రతిపాదనలో బలమైన అంశాలు కానీ లేదా ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీలో సరైన అనుభవం కానీ లేవు. దీంతో అసలు ఇన్వెస్కో నిర్ణయం వెనుక ఉన్న కారణం ఏంటనే సందేహాలు కలుగుతున్నాయి. జీల్ బోర్డు (ZEEL board) విషయానికొస్తే.. వినోద రంగానికి చెందిన మహామహులు, అనుభవజ్ఞులు ఉన్నారు. అదే ఇన్వెస్కో ప్రతిపాదిస్తున్న బోర్డు సభ్యుల్లో మీడియాలో కానీ లేదా ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీలో కానీ పెద్దగా అనుభవం ఉన్న వాళ్లు ఎవ్వరూ లేరు. 

Invesco proposed board members for ZEEL -ఈ నేపథ్యంలో ఇన్వెస్కో ప్రతిపాదించిన బోర్డ్‌లో ఉన్న సభ్యులు ఎవరు ? వారి యోగ్యతలు ఏంటనే వివరాలపై ఓ స్మాల్ లుక్కేద్దాం.
Surendra Singh Sirohi -  సురేంద్ర సింగ్ సిరోహి:
- మీడియాలో ఎలాంటి అనుభవం లేదు.
- లిమిటెడ్ కంపెనీలో లిమిటెడ్ ఎక్స్‌పీరియెన్స్. ప్రస్తుతం హెచ్ఎఫ్‌సీఎల్ బోర్డులో సభ్యుడు.
- భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో (BEL) మూడేళ్ల అనుభవం.
- టెలికాం రంగంలో ఉన్న అనుభవం జీ ఎంటర్‌టైన్మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌కి (ZEE Entertainment Enterprises Limited (ZEEL)) సరిపోతుందా ?

Also read : ZEEL, Sony merger deal: జీల్, సోనీ విలీనంపై కీలక ప్రకటన.. మీడియా ప్రపంచంలో కీలక పరిణామం

Aruna Sharma - అరుణ శర్మ :
- జిందాల్ స్టీల్ కంపెనీ బోర్డులో రెండేళ్లపాటు స్వతంత్ర డైరెక్టర్‌గా కొనసాగారు.
- తొలి కాల వ్యవధి ముగిశాకా మళ్లీ దక్కని అవకాశం.
- వెల్‌స్పన్ ఎంటర్‌ప్రైజెస్‌లో ప్రస్తుతం ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా ఉన్నారు.
- దూరదర్శన్ డైరెక్టర్ జనరల్‌గా ఉంటూనే కామన్వెల్త్ గేమ్స్ ప్రజెంట్ చేసి వివాదంలో చిక్కుకున్నారు. 
- ప్రొడక్షన్, ప్రజెంటేషన్‌లో ప్రైవేటు కంపెనీ విచారణ. 
- అరుణ శర్మ ప్రైవేటు కంపెనీలకు మేలు చేశారని ఆరోపించిన షుంగ్లు కమిటీ.
- ఫలితంగా ప్రభుత్వానికి రూ. 135 కోట్ల నష్టం వాటిల్లినట్టు అంచనా.
- ఐపిసి, పీసీఏ కింద చర్యలకు ప్రతిపాదించిన కమిటి.
- ఫెమా యాక్ట్ ఉల్లంఘనలు కింద (FEMA violation ) విచారణ చేపట్టిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.

Naina Krishnamurthy - నైన క్రిష్ణమూర్తి:
- లిస్టెడ్ కంపెనీలో లిమిటెడ్ ఎక్స్‌పీరియెన్స్.
- మీడియా రంగంలో కానీ లేదా ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీలో కానీ సరైన అనుభవం లేదు.

Also read : ZEEL-Sony merger updates: జీల్, సోని పిక్చర్స్ విలీనంతో కంపెనీ షేర్స్‌లో వృద్ధి

Rohan Dhamija - రోహన్ ధమిజ:
- గతంలో లిస్టెడ్ కంపెనీ బోర్డులో పనిచేసిన అనుభవమే లేదు.
- ఎనాలసిస్ మేషన్‌లో మేనేజింగ్ పార్ట్‌నర్‌గా అనుభవం. 
- మీడియా లేదా ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీలో ఎలాంటి అనుభవం లేదు.

Srinivasa Rao Addepalli - శ్రీనివాస రావు అడ్డేపల్లి:
- టాటా గ్రూప్ తప్పించి ఎక్కడా మేజర్ ఎక్స్‌పీరియెన్స్ లేదు. 
- శ్రీనివాస రావు స్టార్టప్ కంపెనీ గ్లోబల్ గ్యాన్‌లో టాటా ఇన్వెస్టర్‌గా ఉంది.
- గ్లోబల్ గ్యాన్ స్టార్టప్‌లో రతన్ టాటా ఇన్వెస్టర్‌గా ఉన్నారు.
- రతన్ టాటా ఎంత మొత్తంలో పెట్టుబడులు పెట్టారు అనే అంశంపై స్పష్టత లేదు.
- గ్లోబల్ గ్యాన్ దక్కించుకున్న ప్రాజెక్టులు చాలా వరకు టాటా సంస్థలకు చెందినవే కావడం గమనార్హం.
- టాటా సంస్థకు చెందిన చాలా మంది గ్లోబల్ గ్యాన్‌లో (Global Gyan) సలహాదారులుగా, ఫ్యాకల్టీ మెంబర్ పాత్ర పోషిస్తున్నారు.

Gaurav Mehta - గౌరవ్ మెహతా : 
- రైనె అడ్వైజర్స్ ఇండియా ప్రైవెట్ లిమిటెడ్ కంపెనీకి పనిచేశారు.
- లిస్టెడ్ కంపెనీలో అనుభవం లేదు.
- యూఎస్ సెక్యురిటీస్ అండ్ ఎక్స్‌చేంజ్ కమిషన్‌లో (US SEC) బ్రోకర్ డీలర్‌గా పేరు నమోదు చేసుకున్న ఓ కంపెనీకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో ఒకరిగా ఉన్నారు.

Also read: ZEEL, Sony merger deal value: జీ ఎంటర్‌టైన్మెంట్, సోనీ పిక్చర్స్ విలీనం.. ఎవరి బలాలు ఎంత ?

Tough questions for Invesco by Zee Business: ప్రస్తుతం ఇన్వెస్కోకు జీ బిజినెస్ సంధిస్తున్న సూటి ప్రశ్నలు ఇవే: 

- ఇన్వెస్కో ప్రతిపాదించిన బోర్డు సభ్యులకు మీడియాలో కానీ లేదా ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీ, డిజిటల్, టెక్నాలజీ రంగాల్లో కానీ అనుభవం ఎక్కడుంది ?
- విలీనం, కొనుగోలు, ఆమోదం లాంటి పెద్ద పెద్ద నిర్ణయాల్లో అనుభవం ఎక్కడుంది ?
- 18% వాటా లేకుండానే బోర్డులో 6 స్థానాలు దక్కించుకునే హక్కు ఎక్కడి నుంచి వచ్చింది ?
- ఇన్వెస్కో ఆర్థికపరమైన అంశాల్లోనే పెట్టుబడిదారు కానీ వ్యూహాత్మక పెట్టుబడిదారు కాదనే విషయాన్ని ఆ కంపెనీ ఎలా మర్చిపోయింది ?
- ఒకవేళ ఇన్వెస్కో వద్ద బలమైన ప్రతిపాదన ఏదీ లేనట్టయితే, జీల్-సోని విలీనాన్ని (ZEEL-SONY merger) అడ్డుకోవాలని ఎందుకు చూస్తోంది ?
- భారత్‌లోనే అతి పెద్ద బ్రాండ్‌గా పేరు సంపాదించుకున్న కంపెనీ ఇమేజ్ దెబ్బతీయాలని ఇన్వెస్కో (Invesco) లాంటి విదేశీ పెట్టుబడిదారులు భావిస్తున్నాయా ?

జీ బిజినెస్ (Zee  Business) సంధించిన ఈ ప్రశ్నలకు ఇన్వెస్కో ఏమని సమాధానం చెబుతుందో వేచిచూడాల్సిందే మరి.

Also read : ZEEL-Sony MEGA Merger: జీల్, సోనీ విలీన సంస్థలో వాటాల వివరాలు, వ్యూహ్యాత్మక అంశాలు ఇవే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News