Punjab Election Results 2022: పంజాబ్ ఫలితాలు ఆశ్చర్యం కల్గిస్తున్నాయి. అధికార పార్టీ పరాజయం పొందడమే కాకుండా..కొత్త పార్టీకి పట్టం కట్టారు ప్రజలు. ఎందుకీ మార్పు, ఆ కారణాలేంటి


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. యూపీలో బీజేపీ విజయం ఊహించిందే అయినా..పంజాబ్‌లో ఆప్ క్లీన్‌స్వీప్ మెజార్టీ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. రాష్ట్రంలోని ప్రధాన పార్టీల్ని చీపురుతో ఊడ్చేసిన ఆప్..తగ్గేది లేదంటోంది. పంజాబ్‌లోని అధికార కాంగ్రెస్ పార్టీని, బీజేపీని వెనక్కి నెట్టి..క్లీన్‌స్వీప్ మెజార్టీ దక్కించుకుంది. పంజాబ్‌లో ఆప్ భారీ విజయానికి కారణాలేంటో విశ్లేషిద్దాం.


పంజాబ్‌లో కాంగ్రెస్ స్వయం కృతాపరాధాలే ఆ పార్టీని ఓటమి అంచుకునెట్టేశాయి. పంజాబ్ ముఖ్యమంత్రిగా గతంలో ఉన్న కెప్టెన్ అమరిందర్ సింగ్..కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొచ్చేందుకు చాలా కృషి చేశారు. గత ఎన్నికలకు ముందు బీజేపీని వదిలిపెట్టి కాంగ్రెస్‌లో చేరిన మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూకు, కెప్టెన్ అమరిందర్ సింగ్‌కు విభేదాలు పార్టీని తీవ్రంగా నష్టపరిచాయి. ఎంతగా అంటే..కెప్టెన్ అమరిందర్ సింగ్ పదవి కోల్పోవడమే కాకుండా..పార్టీకి దూరమైపోయారు. అనంతరం ముఖ్యమంత్రి రేసులో చన్నీ ఎంపికైనా..నవజ్యోత్‌తో మళ్లీ దూరమే కొనసాగింది. ఒక ముక్కలో చెప్పాలంటే నవజ్యోత్ సింగ్ సిద్ధూ వైఖరే పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరాజయానికి కారణమైంది.


ఇక ప్రతిపక్షం శిరోమణి అకాళీదళ్ క్రమంగా వైభవం కోల్పోతుంది. రైతు చట్టాల ముందు వరకూ ఎన్డీయే ప్రభుత్వంలో కొనసాగిన శిరోమణి అకాళీదళ్‌పై..ప్రజలు ముఖ్యంగా రైతులు విశ్వసించలేదు. కారణం కొత్త రైతు చట్టాల విషయంలో దేశంలో ఎక్కువగా వ్యతిరేకత పెల్లుబికింది పంజాబ్ నుంచే. కాంగ్రెస్ పరిస్థితి ఘోరంగా మారింది. అకాళీదళ్‌ను ప్రజలు విశ్వసించలేని పరిస్థితి. కొత్త రైతు చట్టాలతో బీజేపీ పూర్తిగా వ్యతిరేకత కొనితెచ్చుకుంది. ఈ అన్ని పరిణామాల నేపధ్యంలో పంజాబ్‌లో ప్రజలకు ప్రత్యామ్నాయం కావల్సి వచ్చింది. 


ఆ ప్రత్యామ్నాయం ఆప్ రూపంలో, కేజ్రీవాల్ రూపంలో కన్పించింది. అదే సమయంలో ఢిల్లీలో ఆప్ పాలన పంజాబ్ ప్రజల్ని ఆకర్షించింది. ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్ధిపై రాష్ట్రంలో స్థానికంగా కొంత వ్యతిరేకత ఉన్నా..మొత్తంగా చూస్తే కేజ్రీవాల్ నాయకత్వాన్ని అక్కడి ప్రజలు అంగీకరించిన పరిస్థితి.


Also read: Uttar pradesh: ఉత్తరప్రదేశ్‌లో దూసుకుపోతున్న బీజేపీ, రెండవసారి ముఖ్యమంత్రిగా యోగీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook