Uttar pradesh: ఉత్తరప్రదేశ్‌లో దూసుకుపోతున్న బీజేపీ, రెండవసారి ముఖ్యమంత్రిగా యోగీ

Uttar pradesh: దేశంలోని ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యేలా యూపీలో బీజేపీ ఆధిక్యం స్పష్టంగా కన్పిస్తోంది. వరుసగా రెండవసారి యోగీ అధికారం సాధించే దిశగా దూసుకెళ్తున్నారు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 10, 2022, 10:40 AM IST
 Uttar pradesh: ఉత్తరప్రదేశ్‌లో దూసుకుపోతున్న బీజేపీ, రెండవసారి ముఖ్యమంత్రిగా యోగీ

Uttar pradesh: దేశంలోని ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యేలా యూపీలో బీజేపీ ఆధిక్యం స్పష్టంగా కన్పిస్తోంది. వరుసగా రెండవసారి యోగీ అధికారం సాధించే దిశగా దూసుకెళ్తున్నారు.

ఉత్తర్‌ప్రదేశ్ మళ్లీ బీజేపీదేనని అర్ధమవుతోంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది. యూపీలో మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పర్చనుందని తెలుస్తోంది. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి యూపీలో బీజేపీ ట్రెండ్‌లో ఉంది. ఇప్పటి వరకూ తెలిసిన లెక్కల ప్రకారం బీజేపీకు రాష్ట్రంలో 52 శాతం ఓటింగ్, బీఎస్పీకు 22.1 శాతం, ఎస్పీకు 16.3 శాతం ఓట్లు లభించాయి. అటు మొత్తం సీట్లు 260 వరకూ ఆధిక్యంలో ఉంది బీజేపీ. ఇటు సమాజ్‌వాదీ పార్టీ వందకు పైగా సీట్లలో ఆధిక్యంలో ఉంది. సీట్ల పరంగా చూస్తే బీఎస్పీ, కాంగ్రెస్ లు పూర్తిగా వెనుకబడి ఉన్నాయి. యూపీలో అధికారం కోసం కావల్సిన మేజిక్ ఫిగర్ 202 కాగా..ఇప్పటికే బీజేపీ 260 సీట్లో ఆధిక్యంలో ఉంది. ఈ ఆధిక్యం ఇలాగే కొనసాగితే ఇక బీజేపీ రెండవసారి అధికారం కైవసం చేసుకున్నట్టే. ఇప్పటి వరకూ ఉన్న ట్రెండ్‌లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. 

Also read: Goa Results 2022: మరి కాస్సేపట్లో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, గోవాలో మొదలైన క్యాంప్ రాజకీయాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook      

Trending News