Navjot Singh Sidhu: బలహీనమైన వ్యక్తి సీఎంగా ఉండాలనుకుంటున్నారు.. సిద్ధూ సంచలన వ్యాఖ్యలు!
Navjot Singh Sidhu, Punjab Elections 2022: త్వరలో జరగనున్న పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుఫున సీఎం రేసులో ఎవరు ఉంటారనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చరణ్ జిత్ సింగ్ చన్నీ.. నవజ్యోత్ సింగ్ సిద్ధూ మధ్య గట్టి పోటీనే నడుస్తోంది.
Navjot Singh Sidhu, Punjab CM Candidate: ప్రస్తుతం పంజాబ్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఆసక్తికరంగా మారాయి. అయితే ఒకవేళ అక్కడ కాంగ్రెస్ (Congress) విజయం సాధిస్తే సీఎం ఎవరనే అంశంపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. పంజాబ్ ముఖ్యమంత్రి రేసులో (Punjab CM Candidate) ప్రస్తుతం పంజాబ్ సీఎంగా ఉన్న చరణ్ జిత్ సింగ్ చన్నీతో పాటు ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అయిన నవజ్యోత్ సింగ్ సిద్ధూ
ఉన్నారు.
అయితే ఒకవేళ పంజాబ్‌లో కాంగ్రెస్ గెలిస్తే చరణ్ జిత్ సింగ్‌నే మళ్లీ సీఎంగా చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. (Navjot Singh Sidhu) కాంగ్రెస్ అధిష్టానంపై మండిపడ్డారు. తన మద్దతుదారులతో నవజ్యోత్ సింగ్ సిద్ధూ తాజాగా ఒక సమావేశం నిర్వహించారు.
కొత్త పంజాబ్ (Punjab) నిర్మాణం అనేది ముఖ్యమంత్రి ద్వారానే సాధ్యం అవుతుందని సిద్ధూ చెప్పుకొచ్చారు. అయితే పార్టీ అధిష్టానమేమో తాము ఎలా చెప్తే అలా వినే బలహీనమైన వ్యక్తి సీఎంగా ఉండాలని భావిస్తోందని నవజ్యోత్ సింగ్ సిద్ధూ అన్నారు. అయితే ఈసారి మాత్రం ముఖ్యమంత్రిని ప్రజలే ఎన్నుకోవాలి అంటూ ఆయన పిలుపునిచ్చారు.
కాగా పంజాబ్ సీఎం రేసులో (CM Race) చరణ్ జిత్ సింగ్ చన్నీ, నవజ్యోత్ సింగ్ (Navjot Singh Sidhu) సిద్ధూలలో ఎవరినీ ఉంచాలని ప్రజల నుంచి అభిప్రాయాలను తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. అయితే ఈ అభిప్రాయ సేకరణలో ఎక్కువశాతం మంది చరణ్ జిత్‌వైపే (Charanjit Singh Channi) మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇక మరికొన్ని రోజుల్లోనే పంజాబ్ సీఎం (CM) అభ్యర్థిని కాంగ్రెస్ ప్రకటించనుంది. ఈ నెల 20వ తేదీన పంజాబ్‌లో (Punjab) అసెంబ్లీ ఎన్నికలు (Elections) జరగనున్నాయి.
Also Read: Allu Arjun Zomato: మనసు కోరితే తగ్గేదే లే.. జొమోటో ఓపెన్ చేయడమే! అరె బన్నీ కూడా ఏసేశాడుగా!!
Also Read: Home Vastu Tips: గుమ్మంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలా చేయొద్దు.. చేస్తే అరిష్టమే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook