Allu Arjun Zomato: మనసు కోరితే తగ్గేదే లే.. జొమోటో ఓపెన్ చేయడమే! అరె బన్నీ కూడా ఏసేశాడుగా!!

Allu Arjun Zomato: ఫుడ్ డెలివరీ యాప్ జొమోటో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను తమ ప్ర‌చార‌క‌ర్త‌గా నియమించుకుంది. జొమోటో కోసం బన్నీ ఓ యాడ్ చేశారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 4, 2022, 04:43 PM IST
  • మనసు కోరితే తగ్గేదే లే
  • జొమోటో ఓపెన్ చేయడమే
  • జొమోటో యాడ్‌లో సుబ్బ‌రాజ్
Allu Arjun Zomato: మనసు కోరితే తగ్గేదే లే.. జొమోటో ఓపెన్ చేయడమే! అరె బన్నీ కూడా ఏసేశాడుగా!!

Allu Arjun As Brand Ambassador for Zomato: ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌, క్రియేటివ్ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషనల్‌లో వచ్చిన 'పుష్ప: ది రైజ్‌' సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో ప్రత్తేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్‌ ఇండియా లెవల్లో రిలీజ్ అయిన పుష్ప.. 50 రోజులు పూర్తయినా 'తగ్గేదే లే' అంటోంది. ఈ సినిమాతో అల్లు అర్జున్‌ నేషనల్ లెవ‌ల్‌లో పెద్ద స్టార్ అయ్యాడు. బన్నీ రేంజ్ కూడా అమాంతం పెరిగింది. దీన్ని  ప‌లు కంపెనీలు ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇప్ప‌టికే ఆహా, ర్యాపిడో బైక్ కంపెనీలు త‌మ బ్రాండ్ల‌కు ప్ర‌చార‌క‌ర్త‌గా నియ‌మించుకున్నాయి.

తాజాగా ఫుడ్ డెలివరీ యాప్ జొమోటో కూడా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను తమ ప్ర‌చార‌క‌ర్త‌గా నియమించుకుంది. ఈ క్రమంలో జొమోటో కోసం బన్నీ ఓ యాడ్ చేశారు. జొమోటో ఈ రోజు (ఫిబ్రవరి 4) ఆ యాడ్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ యాడ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ నయా యాడ్‌లో అల్లు అర్జున్‌తో పాటు సుబ్బరాజ్ కూడా ఉన్నాడు. ఇందులో బన్నీ 'మనసు కోరితే తగ్గేదే లే.. జొమోటో ఓపెన్ చేయడమే' అనే డైలాగ్ హైలెట్ అయింది. 

యాడ్‌లో సుబ్బ‌రాజ్ ఇచ్చే పంచ్ నుంచి త‌ప్పించుకున్న అల్లు అర్జున్‌ అత‌డికే రివ‌ర్స్‌లో పంచ్ ఇస్తాడు. దీంతో సుబ్బ‌రాజ్ ఒక్కసారిగా గాల్లోకి లేస్తాడు. గాల్లోనే ఉన్న సుబ్బ‌రాజ్ మాట్లాడుతూ.. 'బ‌న్నీ.. న‌న్ను కొంచెం త్వరగా కింద ప‌డేయ‌వా?' అంటాడు. 'సౌత్ సినిమా కదా.. కొంచెం ఎక్కువసేపు ఎగరాలి' అని అల్లు అర్జున్‌ రిప్లై ఇస్తాడు. ఆ వెంటనే  'గోంగూర మటన్ తినాలని ఉంది. కిందకు వచ్చేలోపు రెస్టారెంట్ మూసేస్తారు' అని సుబ్బరాజ్ అంటాడు. 'గోంగూర మటన్ ఏంటి? ఎప్పుడు ఏం కావాలన్నా జొమోటో ఉందిగా' అని అల్లు అర్జున్ మొబైల్ తీస్తాడు. ఇది యాడ్‌. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Zomato (@zomato)

ఇక సుబ్బ‌రాజ్ గోంగూర మటన్ తింటుండగా.. 'ఏం కావాలన్నా.. ఎప్పుడు కావాలన్నా జొమోటో అందిస్తుంది సూపర్ ఫాస్ట్‌గా' అని అల్లు అర్జున్‌ అంటాడు. ఇక చివరగా.. 'మనసు కోరితే తగ్గేదే లే.. జొమోటో ఓపెన్ చేయడమే' అని బన్నీ డైలాగ్ చెపుతాడు. ఈ యాడ్‌ని స్టార్ డైరెక్టర్ క్రిష్ డైరెక్ట్ చేశారు. ఈ యాడ్‌ నెట్టింట వైరల్ అయింది. యాడ్‌ చోసిన అందరూ 'అరె బన్నీ కూడా ఏసేశాడుగా' అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

Also Read: Neha Shetty: మేము ఏది చేసినా మీ కోసమే.. హీరోయిన్ నేహా శెట్టి పుట్టుమచ్చల వివాదంపై స్పందించిన హీరో!!

Also Read: UP Polls: యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం యోగి నామినేషన్.. తొలిసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News