Minor Girl Raped in Punjab: ఇటీవల కాలంలో ఆడవారి పైన అత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. చిన్న, పెద్ద, శిశువు, వృద్ధులు అని తేడా లేకుండా ఆడవారు కనిపిస్తే చాలు కొన్ని మానవ మృగాలు వారిపై అత్యాచారానికి పాల్పడుతున్నారు. మన భారతదేశంలో పోక్సో చట్టం అందుబాటులో ఉన్నప్పటికీ కూడా ఆడవారిపై అఘాయిత్యాలు తగ్గడం లేదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అప్పుడే పుట్టిన శిశువును మొదలుకొని కాటికి కాలు చాపిన వృద్ధురాలి వరకు చాలామంది ఆడవారు పని ప్రదేశాలతో పాటు ఒంటరిగా కనిపిస్తే చాలు వారిపై అత్యాచారానికి పాల్పడుతున్నారు కొంతమంది మానవ మృగాలు. ఇక ఇప్పుడు మైనర్ బాలికపై కూడా అత్యాచారానికి పాల్పడ్డాడు ఒక దుండగుడు.  తొలిసారి ఇతడు చేసిన పనికి పంజాబ్ కోర్టు తీసుకున్న నిర్ణయానికి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 


అసలు విషయంలోకి వెళితే, అహ్మదాబాద్ కి చెందిన మక్బానా నిహారవ్ గణపత్ భాయ్ అనే వ్యక్తి.. గత ఏడాది ఫిబ్రవరిలో రూప్ నగర్ జిల్లాకు చెందిన బాలికతో సోషల్ మీడియాలో స్నేహం చేసి, ఆమెను ఆకర్షించాడు. ఆమెను గుజరాత్ కు  తీసుకెళ్లి అక్కడ నెలపాటు అక్రమ నిర్బంధంలో ఉంచి పలుమార్లు ఆమెపై అత్యాచారం చేశాడు.


సోమవారం రోజున ఈ విషయం వెలుగులోకి రావడంతో మైనర్ బాలికపై అత్యాచారం చేసినందుకు గుజరాత్ కు చెందిన భాయ్ అనే 23 ఏళ్ల యువకుడిని పంజాబ్ హైకోర్టు దోషిగా నిర్ధారించి ,దాదాపు 20 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.  లైంగిక నేరాల నుండి పిల్లలకు రక్షణ ఉన్నప్పటికీ పిల్లలపై నేరాలు పెరుగుతున్నాయని పోక్సో చట్టం వెల్లడించింది.


ఆ వ్యక్తికి పోక్సో చట్టంలోని సెక్షన్స్ 6 (తీవ్రమైన లైంగిక వేధింపులు) కింద 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించబడింది. సెక్షన్ 363 (కిడ్నాప్) కింద ఐదు సంవత్సరాలు సెక్షన్ 366 ( కిడ్నాప్ అపహరణం లేదా స్త్రీని బలవంతంగా పెళ్లి చేసుకోమని ప్రేరేపించడం) కింద ఏడేళ్లు అలాగే సెక్షన్ 344 కింద మూడు సంవత్సరాల పాటు శిక్ష విధించింది ఇండియన్ పీనల్ కోడ్. అన్ని శిక్షలు ఏకకాలంలో అమలు చేసేలా చూడమని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. 


పిల్లలపై నేరాలను అరికట్టడానికి కఠినమైన నిబంధనలు కలిగి ఉన్న పోక్సో చట్టం అమలులోకి వచ్చినప్పటికీ కూడా ప్రతి సంవత్సరం పిల్లలపై నేరాలు పెరిగిపోతున్నాయని అదనపు జిల్లా సెషన్స్ నిర్మాత.. రమేష్ కుమారి వెల్లడించారు.


Also Read: Adimulam: సత్యవేడు ఎమ్మెల్యే రాసలీలల ఘటనలో మరో బిగ్ ట్విస్ట్.. ముక్కున వేలేసుకుంటున్న నేతలు.. 


Also Read: Low Pressure Threat: ఏపీకు పొంచి ఉన్న మరో అల్పపీడనం, తుపానుగా మారుతుందా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.