వారిపై దాడిని తీవ్రంగా ఖండించిన రాహుల్ గాంధీ
రాజస్థాన్‌లో ఇద్దరు దళితులను చిత్రహింసలు పెట్టడం పట్ల కాంగ్రెస్ యువ నాయకులు రాహుల్ గాంధీ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఇది దారుణమైన ఘటనని, తీవ్ర మనస్తాపాన్ని వ్యక్తం చేషారు.
జైపూర్: రాజస్థాన్‌లో ఇద్దరు దళితులను చిత్రహింసలు పెట్టడం పట్ల కాంగ్రెస్ యువ నాయకులు రాహుల్ గాంధీ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఇది దారుణమైన ఘటనని, తీవ్ర మనస్తాపాన్ని వ్యక్తం చేషారు. రాజస్థాన్ దళిత యువకులపై కొందరు వ్యక్తులు దాడికి దిగి కొట్టడం, వారి బట్టలు విప్పి, వారిలొ ఒకరి శరీరంలో స్క్రూడ్రైవర్ దింపడం వంటి దృశ్యాలతో కూడిన వీడియో సామాజిక మాధ్యమంలో వెలుగులోకి వచ్చింది. అది చూసిన వెంటనే రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
యువకులను చితకబాదిన వారే ఈ దృశ్యాన్ని చిత్రీకరించి నెట్‌లో పెట్టారని వెల్లడి కాగా, ఇది అత్యంత బాధాకర ఘటన, దీనికి రాజస్థాన్ ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని రాహుల్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ ప్రభుత్వం వెంటనే స్పందించి దోషులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనపై కాంగ్రెస్‌కు చెందిన ఎస్‌సి బృందం స్పందించింది. ముఖ్యమంత్రి ఈ ఉదంతంపై దర్యాప్తునకు ఆదేశించాలని డిమాండ్ చేసింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..