Assam Elections: అస్సోంలో అప్పుడే అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. పౌరసత్వ సవరణ చట్టం కాంగ్రెస్ పార్టీకు ప్రచారాస్త్రంగా మారింది. అధికారంలో వస్తే సీఏఏను ఎప్పటికీ అమలు కానివ్వమంటోంది కాంగ్రెస్ పార్టీ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో తమిళనాడు ( Tamil nadu ), పశ్చిమ బెంగాల్ ( West Bengal ), అస్సోం ( Assam )తదితర రాష్ట్రాల్లో 2-3 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ( Assemly Elections ) జరగనున్నాయి. అస్సోంలో అప్పుడే ఎన్నికల వేడి ప్రారంభమైంది. అస్సోంలోని శివసాగర్‌లో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ నిర్వహించింది. పౌరసత్వ సవరణ చట్టాన్ని ( Citizenship amendment act ) కాంగ్రెస్ పార్టీ ప్రచారాస్త్రంగా మలచుకుంటోంది. పార్టీ అధికారంలో వస్తే..రాష్ట్రంలో సీఏఏ ఎప్పటికీ అమలు కానివ్వమని రాహుల్ గాంధీ ( Rahul Gandhi )హామీ ఇచ్చారు.అస్సోం విభజనకు బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లు కుట్ర చేస్తున్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. అస్సోం ఒప్పందంలోని ప్రతి అంశాన్ని పరిరక్షించేందుకు తమ పార్టీ కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రానికి సొంత ముఖ్యమంత్రి అవసరమని..ప్రజల సమస్యల్ని వినగలిగినవాడై ఉండాలని చెప్పారు. నాగపూర్, ఢిల్లీ చెప్పినట్టు నడుచుకునేవాడు కాకూడదని విమర్శించారు.  


మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ సారధ్యంలోని కాంగ్రెస్ పార్టీకు ప్రజలు మరో అవకాశం కల్పించాలని రాహుల్ గాంధీ కోరారు. ప్రస్తుత ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ కేవలం ఢిల్లీ, నాగపూర్ చెప్పినట్టే నడుచుకుంటున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీ ( Pm modi ), హోంమంత్రి అమిత్ షా ( Home minister Amit shah )‌లు రాష్ట్రంలోని సహజవనరుల్ని, పబ్లిక్ సెక్టార్ యూనిట్లను వ్యాపారవేత్తలకు కట్టబెట్టే పనిలో ఉన్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలు అస్సలు పట్టవని చెప్పారు.  అస్సోం అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో సీఏఏ ( CAA )పై చేసిన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయం ఆసక్తికరంగా మారింది. 


Also read: Modi Photo: ప్రధాని మోదీ స్వయంగా తీసిన ఆ ఫోటో..ఎక్కడో తెలుసా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook